Shruti Haasan: ప్రభాస్ సినిమా కోసం పెద్ద సాహసమే చేయనున్న శ్రుతిహాసన్.. అదేంటంటే

టాలీవుడ్ లో శ్రుతిహాసన్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. అనగనగా ఓ ధీరుడు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయినా శ్రుతి. ఆతర్వాత వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది శ్రుతిహాసన్. ఆలాగే తమిళ్ లోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంది. కేవలం తెలుగు, తమిళ్ లోనే కాదు హిందీలోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఆ మధ్య వరుస ఫ్లాప్ లతో సతమతం అయ్యింది శ్రుతి.

Shruti Haasan: ప్రభాస్ సినిమా కోసం పెద్ద సాహసమే చేయనున్న శ్రుతిహాసన్.. అదేంటంటే
Shruti Haasan

Updated on: Aug 29, 2023 | 7:19 AM

సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ స్టార్స్ గా రాణిస్తున్నారు. కానీ చాలా మంది హీరోయిన్స్ కు డబ్బింగ్ మాత్రం చెప్పలేకపోతున్నారు. అలాంటి హీరోయిన్స్ లో శ్రుతిహాసన్ కూడా ఒకరు. టాలీవుడ్ లో శ్రుతిహాసన్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. అనగనగా ఓ ధీరుడు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయినా శ్రుతి. ఆతర్వాత వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది శ్రుతిహాసన్. ఆలాగే తమిళ్ లోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంది. కేవలం తెలుగు, తమిళ్ లోనే కాదు హిందీలోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఆ మధ్య వరుస ఫ్లాప్ లతో సతమతం అయ్యింది శ్రుతి. అదే సమయంలో మాస్ రాజా రవితేజ తో కలిసి సాలిడ్ హిట్ అందుకుంది.

ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన క్రాక్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. క్రాక్ సినిమా తర్వాత తిరిగి వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. రీసెంట్ గా బాలకృష్ణ నటించిన  ‘వీరసింహారెడ్డి’, మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ లాంటి  రెండు సినిమాలతో  హిట్స్ అందుకుంది.  ప్రస్తుతం శ్రుతిహాసన్ తెలుగు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు జోడీగా నటిస్తుంది.

అంతే కాదు ఒక్క భాషలో కాదు ఏకంగా ఐదు భాషల్లో సినిమాకు డబ్బింగ్‌ చెబుతోందట. ఇప్పుడు ఇదే టాపిక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. శ్రుతి తన పాత్ర కోసం డబ్బింగ్‌ చెప్పడం కూడా మొదలు పెట్టేసిందట. త్వరలోనే సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

శ్రుతిహాసన్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.