Samantha: సమంత పక్కన కూర్చోవాలంటే సిగ్గేసింది.. రాజ్ నిడిమోరు పిన్ని కామెంట్స్ వైరల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, బాలీవుడ్ దర్శకుడు రాజ్‌ నిడిమోరు ఇటీవలే పెళ్లిపీటలెక్కన సంగతి తెలిసిందే. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో యోగా ఆశ్రమంలో ఉన్న లింగ భైరవి ఆలయంలో వీరి పెళ్లి జరిగింది. ఈ వివాహ వేడుకకు అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

Samantha: సమంత పక్కన కూర్చోవాలంటే సిగ్గేసింది.. రాజ్ నిడిమోరు పిన్ని కామెంట్స్ వైరల్
Samantha Marriage

Updated on: Dec 07, 2025 | 7:50 PM

సమంత రాజ్‌ నిడిమోరుల పెళ్లి వేడుకకు సంబంధించి సామ్ స్నేహితురాలు, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాజాగా వివాహంపై రాజ్ నిడిమోరు పిన్ని శోభారాజు మరికొన్నిఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. అన్నమయ్య సంకీర్తనలు పాడటం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె సామ్ పెళ్లికి ముందు ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. ‘రాజ్‌.. మా అక్క కుమారుడు. బాల్యంలో డివోషనల్‌ సాంగ్స్‌ పాడేవాడు. రాజ్‌పై నాకు ప్రేమ ఎక్కువ. ఇక సమంత విషయానికి వస్తే.. ఆహారం విషయంలో ఆమె చాలా క్రమశిక్షణతో ఉంటుందని, మూడు నెలలకోసారి ఈశా యోగా కేంద్రానికి వెళ్లి ధ్యానం చేస్తుంటుందని విన్నాను. ఆ తర్వాత అది నిజమని తెలిసింది. సన్నగా ఉన్న సమంత పక్కన కూర్చోవాలంటే సిగ్గేసింది. బరువు తగ్గేందుకు సమంత చెప్పిన సలహాలు, సూచనలు ఫాలో కావాలంటే భయమేసింది. ఆధ్యాత్మిక చింతన కలిగిన అమ్మాయి.. రాజ్‌ జీవితంలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. రాజ్‌ కూడా ఆహారం, వ్యాయామం, ధ్యానం.. ఇలా అన్ని విషయాల్లో క్రమశిక్షణతో ఉంటాడు. వీరి వివాహ పద్ధతిలో ‘క్లేశ నాశన’ ఓ భాగం. సాత్వికాహారం పెట్టారు. సహజ సిద్ధమైన పర్‌ఫ్యూమ్స్‌ని గిఫ్ట్‌గా ఇచ్చారు. పెళ్లి దుస్తుల్లో సమంత చాలా బాగుందిఅని శోభరాజు చెప్పుకొచ్చారు.

 

ఇవి కూడా చదవండి

కాగా పెళ్లి వేడుక తర్వాత మళ్లీ తమ ప్రొఫెషనల్ వర్క్స్ లో బిజీ అయిపోయారు సమంత, రాజ్. శుభం సినిమాతో నిర్మాతగా సక్సెస్ అందుకున్న సామ్ ఇప్పుడుమా ఇంటి బంగారం’ సినిమాలో నటిస్తోంది. సినిమాకు కూడా సామ్ నే నిర్మాతగా వ్యవహరిస్తోంది. అలా మొదలైంది, బేబీ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు కాంతార విలన్ గుల్షన్ దేవయ్య సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక రాజ్ విషయానికి వస్తే.. ఇటీవల అతను తెరకెక్కించిన ‘ది ఫ్యామిలీమ్యాన్‌ 3’ వెబ్‌సిరీస్‌ అమెజాన్ ప్రైమ్ లో దూసుకెళ్లిపోతోంది. ఇటీవలే ముంబయిలో సిరీస్ సక్సెస్ పార్టీ కూడా నిర్వహించారు. పార్టీలోరాజ్‌తోపాటు డైరెక్టర్‌ డీకే, నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌ తదితరులు పాల్గొన్నారు.

సామ్ – రాజ్ నిడిమోరుల పెళ్లి ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.