Upasana Konidela: అల్లుడి పాటకు అత్త స్టెప్పులు.. మురిసిపోయిన ఉపాసన

దావోస్ రోడ్డుపై అల్లుడు చరణ్ పాటకు అత్త శోభన స్టెప్పులు వేశారు. ఆ వీడియో ప్రజంట్ నెట్టింట్ తెగ వైరల్ అవుతుంది.

Upasana Konidela: అల్లుడి పాటకు అత్త స్టెప్పులు.. మురిసిపోయిన ఉపాసన
Shobana Kamineni Dance For Naatu Naatu Song
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 18, 2023 | 4:18 PM

తండ్రికి తగ్గ తనయుడు రామ్ చరణ్ తేజ్.. ముఖ్యంగా డ్యాన్స్ విషయంలో బాస్‌లో ఎంత గ్రేస్ ఉందో..? ఇంచుమించు అంతే గ్రేస్ చెర్రీలోనూ ఉంది. టాలీవుడ్‌లో బెస్ట్ డ్యాన్సర్స్‌లో చరణ్ ముందు వరసలో ఉంటాడు. ఫ్యాన్స్ చరణ్ డ్యాన్స్ చేస్తుంటే పిచ్చెక్కిపోతారు. ఇక ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ఆనందపడతారో చెప్పతరమా..! మెగా ప‌వ‌ర్ స్టార్ నాటు నాటు పాట డ్యాన్స్‌కు ఫిదా అయ్యారు ఆయన అత్త, ఉపాసన తల్లి శోభనా కామినేని. అంతే కాదండోయ్.. ఏకంగా దావోస్ రోడ్డుపై స్టెప్పులు కూడా వేశారు. ఆర్.ఆర్.ఆర్ మూవీలోని ఈ పాట ఏకంగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకుంది. ఆస్కార్ అవార్డు కూడా కొట్టే అవకాశం ఉంది.

వరల్డ్ వైడ్ తెలుగు సినిమా పాట స్థాయి ఏంటో చాటి చెప్పింది ఈ సాంగ్. డ్యాన్స్ ప్రియులను ఉర్రూతలూగించిన ఈ సాంగ్.. సిగ్నేచర్ స్టెప్పుల‌ను అపోలో హాస్పిట‌ల్స్ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్‌ పర్సన్‌.. ఉపాస‌న మదర్ శోభన‌ కామినేని అనుకరించారు. దావోస్‌లో ఉన్న ఆమె నాటు నాటు పాట‌కు రోడ్డుపై కాలు కదిపారు. ఈ మధ్య తనకు ఆర్.ఆర్.ఆర్ గురించే ఎక్కువ ప్రశ్నలు ఎదురవుతున్నాయని  తెలిపారు. దావోస్‌ వేదికగా జరుగుతోన్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న ఆమె.. ఓ జర్నలిస్ట్ కోరిక మేరకు ఇలా డ్యాన్స్ చేశారు.

తన తల్లి నాటు.. నాటు సాంగ్‌కు డ్యాన్స్ చేయడంపై ఉపాసన సోషల్ మీడియాలో స్పందించారు. ‘అత్తగారు గర్వంగా ఫీలవుతున్నారు.. .. దావోస్‌లో నాటు నాటు స్టెప్పులు’ అని పేర్కొన్నారు. ప్రజంట్ ఈ వీడియోను నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. చరణ్, తారక్ కలిసి డ్యాన్స్‌తో దుమ్మురేపిన ఈ సాంగ్.. ఇటు మెగా ఫ్యాన్స్‌కు, అటు నంద‌మూరి అభిమానులకు ఈ సాంగ్ ఐ ఫీస్ట్ అనే చెప్పాలి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి