Shiva Shankar Master : సినీ పరిశ్రమలో విషాదం.. శివశంకర్ మాస్టర్ కన్నుమూత..

| Edited By: Ram Naramaneni

Nov 28, 2021 | 9:02 PM

శివశంకర్ మాస్టర్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా కరోనా తో బాధపడుతున్న ఆయన కొదిసేపటి క్రితమే కన్ను మూశారు.

Shiva Shankar Master : సినీ పరిశ్రమలో విషాదం.. శివశంకర్ మాస్టర్ కన్నుమూత..
Shiva Shankar Master
Follow us on

శివశంకర్ మాస్టర్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా కరోనాతో బాధపడుతున్న పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో కన్నుమూశారు. ఇటీవల కరోనా బారిన పడిన దగ్గర నుంచి మాస్టర్‌ ఆరోగ్యం విషమించిచడంతో ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ 75శాతం ఇనెఫెక్షన్ సోకడంతో డాక్టర్లు ఎమర్జెన్సీ విభాగంలో చికిత్స అందించారు. మరోవైపు శివశంకర్ మాస్టర్ భార్య, పెద్ద కుమారుడికి కూడా కరోనా సోకింది. ఇక మాస్టర్ చిన్న కుమారుడు అజయ్ కృష్ణ తన తండ్రి, అన్న, అమ్మ బాగోగులు చూసుకుంటూ వచ్చారు. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో.. టాలీవుడ్, కోలివుడ్ డ్యాన్స్ మాస్టర్స్… హీరోలు.. మాస్టర్ కుటుంబానికి సాయం చేశారు. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకుని.. మెరుగైన చికిత్స అందించాలని కోరారు. మాస్టర్ కన్నుమూయడంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సోనూసూద్, హీరో ధనుష్, మెగాస్టార్ చిరంజీవి, మంచు విష్ణు, లారెన్స్ శివశంకర్ మాస్టర్ కుటుంబానికి ఆర్ధిక సాయం చేశారు. శివ శంకర్ మాస్టర్ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారని తెలిసి సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. భారత చలనచిత్ర పరిశ్రమలో 10 భాషల్లో పనిచేసిన అనుభవం శివశంకర్ మాస్టర్ సొంతం. 800 పైగా చిత్రాలకు కొరియోగ్రఫీ అందించారాయన. దాదాపు 30 సినిమాల్లో నటించారు కూడా. బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్న శివశంకర్‌ మాస్టర్‌.. చెన్నైలో పుట్టారు. సలీమ్‌ మాస్టర్‌ దగ్గర శిష్యరికం చేశారు. 2011లో మగధీర చిత్రానికి జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు శివశంకర్ మాస్టర్.

Also Read: ఏపీకి వాతావరణ శాఖ ప్రమాద హెచ్చరిక.. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌

సీమకు జల’సిరి’.. ఉప్పొంగిన హృదయాలు.. రిజర్వాయర్‌లో ఈత కొట్టిన ఎంపీ