Shivani Rajashekar: అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి..! ఇదీ అసలు కథ!
మిస్ ఇండియా కిరీటం కోసం పరితపిస్తున్న శివాని రాజశేఖర్ చుట్టూ విచిత్రమైన వివాదాలు చుట్టుముట్టేశాయి. ఆ కాంపిటిషన్‌కు
మిస్ ఇండియా కిరీటం కోసం పరితపిస్తున్న శివాని రాజశేఖర్ చుట్టూ విచిత్రమైన వివాదాలు చుట్టుముట్టేశాయి. ఆ కాంపిటిషన్‌కు తమిళనాడు తరఫున నామినేట్ అయిన శివానిని వై దిస్ అని క్వశ్చన్ చేస్తున్నారు నెటిజన్లు. అచ్చమైన తెలుగమ్మాయిగా వుండి తమిళమ్మాయిగా ఎందుకు మిస్ ఇండియాకు వెళ్లావు అని నిలదీస్తున్నారు. ఆ డౌట్స్‌పై లేటెస్ట్‌గా క్లారిటీనిచ్చారు శివాని.
”అందరూ అడుగుతున్నారు.. ఎందుకు మిస్ ఇండియా తమిళనాడుగా సెలెక్ట్ అయ్యారు అని. నేను పుట్టింది తమిళనాడులోనే అయినా పెరిగింది మాత్రం తెలుగు రాష్ట్రాల్లో. కనుక నాకు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు తరపున అప్లయ్ చేసేందుకు ఎలిజిబులిటీ వుంది… సో నేను 3 స్టేట్స్ నుంచి అప్లయ్ చేసుకున్నాను. ఏ స్టేట్ తరపున సెలెక్ట్ చేయాలి అనేది జడ్జెస్ చేతిలో ఉంది..” అని చెప్పారు శివాని రాజశేఖర్.
శేఖర్ మూవీ ట్రయిలర్ లాంచ్ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మిస్ ఇండియా వివాదంపై ఈమేరకు స్పష్టతనిచ్చారు. ”నా ఇన్‌స్టా బయో చూస్తే, “miss india tamilnadu from hyderabad” అని పెట్టాను. నేను ఎప్పుడూ తెలంగాణ, ఆంధ్ర అమ్మాయినే.. కానీ తమిళనాడు అంటే ఒక అఫెక్షన్ ఉంటుంది” అంటూ తాత్కాలికంగా నెటిజన్ల నోళ్లు మూయించేశారు.
బైలైన్.. శ్రీహరి… (టీవీ 9 ఎంటర్టైన్మెంట్ డెస్క్)
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: KGF Chapter 2: బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్ 2 ఊచకోత.. ఆమీర్ ఖాన్ దంగల్ రికార్డ్ బ్రేక్..
Viral Video: నాటు నాటు పాటకు పెళ్లికూతురు అదిరిపోయే డ్యాన్స్.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..