Shiva Rajkumar: క్యాన్సర్‌ను జయించి స్వదేశానికి చేరిన శివన్న.. అభిమానుల సాదర స్వాగతం.. వైరల్ వీడియో
క్యాన్సర్ తో బాధపడిన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కు డిసెంబర్ నెలాఖరులో అమెరికాలో శస్త్రచికిత్స జరిగింది. సుమారు నెల రోజులుగా అక్కడే ఉంటోన్న శివన్న ఆదివారం (జనవరి 26) స్వదేశానికి తిరిగొచ్చారు. కాగా ఆయన ప్రస్తుతం రామ్ చరణ్ సినిమా పెద్ది (వర్కింగ్ టైటిల్ ) లో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.

క్యాన్సర్ చికిత్స నిమిత్తం కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ చికిత్స నిమిత్తం నెల రోజుల క్రితం అమెరికా వెళ్లాడు. అమెరికాలోని మియామీ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన నెల రోజుల తర్వాత ఆదివారం (జనవరి 26) తన మాతృదేశానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బెంగళూరు విమానాశ్రయంలో శివరాజ్‌కుమార్‌కు ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయం టోల్ దగ్గర యాపిల్ పండ్లతో అభిమానులు శివన్నకు స్వాగతం పలికారు. ఆ తర్వాత ఇంటికి చేరేవరకు కూడా అభిమానులు శివన్నపై పూల వర్షం కురిపించారు. ఈ సదర్భంగా శివన్న.. అందరికీ నవ్వుతూ చేతులు ఊపుతూ.. తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన వారిని కౌగిలించుకున్నారు. అనంతరం ఎయిర్‌పోర్టు బయట తన కోసం వేచి ఉన్న అభిమానులకు చేతులు ఊపాడు. నివాసానికి చేరుకున్న అనంతరం మీడియా ప్రతినిధులతో శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ.. ‘మొదట అమెరికా వెళ్లెందుకు భయపడ్డాను. విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు కూడా టెన్షన్ వెళ్లాను. కానీ అక్కడికి వెళ్లాక కాన్ఫిడెన్స్ వచ్చింది. అయితే సర్జరీ రోజు మళ్లీ భయం అంటుకుంది. కుటుంబ సభ్యులందరిలోనూ టెన్షన్ నెలకొంది. కానీ జీవితంలో ఏం జరిగినా ఎదుర్కోవాల్సిందేనని మనసులో గట్టిగా అనుకున్నాను’ అని అన్నారు.
రామ్ చరణ్ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతా..
‘ఆపరేషన్ తరువా నేను రెండు మూడు రోజులు లిక్విడ్ ఫుడ్ తో బెడ్ మీదనే ఉన్నాను. ఆ తర్వాత కాస్త విశ్రాంతి తీసుకొని నడవడం ప్రారంభించాను, నెమ్మదిగా నా ఆరోగ్యం మెరుగుపడింది. ఈ టైంలో నా భార్య, పిల్లలు అందరూ నా దగ్గరే నెల రోజుల పాటు ఉన్నారు. నేను త్వరగా కోలుకోవడానికి వారే కారణం. అలాగే మీ అందరి ప్రార్థనలు కూడా ఫలించాయి. అందుకు మీకు రుణపడి ఉంటాను . జీవితం ఒక పాఠం. ఇవన్నీ సహజంగా వస్తాయి. నేను ఏదైనా ధైర్యంగా ఎదుర్కొంటాను. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇప్పుడు 131వ సినిమా కోసం ప్లాన్ చేస్తున్నాను. అలాగే రామ్ చరణ్ సినిమా షూటింగ్ లో కూడా జాయిన్ అవుతాను’ అని శివరాజ్ కుమార్ చెప్పుకొచ్చాడు.
బెంగళూరులో శివన్న దంపతులు..
ಒಂದು ತಿಂಗಳ ನಂತರ ಕರುನಾಡ ಚಕ್ರವರ್ತಿ ಡಾ.ಶಿವರಾಜ್ಕುಮಾರ್ ಅವರು ಅಮೇರಿಕಾದಿಂದ ಬೆಂಗಳೂರಿಗೆ ಬಂದಿದ್ದಾರೆ. ಶಿವರಾಜ್ ಕುಮಾರ್ ಅವರು ಕ್ಯಾನ್ಸರ್ ಸರ್ಜರಿಗಾಗಿ ಅಮೆರಿಕೆಗೆ ಹೋಗಿದ್ದು ಮೊನ್ನೆ ಜನವರಿ 24ಕ್ಕೆ ರಾತ್ರಿ ಅಮೇರಿಕಾದಿಂದ ಹೊರಟಿದ್ದ ಶಿವಣ್ಣ ಇಂದು ಬೆಂಗಳೂರು ತಲುಪಿದ್ದಾರೆ.#NamCinema #DrShivanna #Shivarajkumar… pic.twitter.com/PODa0uSC2N
— 𝐍𝐀𝐌𝐂𝐈𝐍𝐄𝐌𝐀 (@NamCinema) January 26, 2025
ఇంటి దగ్గర..
Glimpss from #Shivanna House 🤩😎
King @NimmaShivanna 👑#DrShivaRajkumar #DrShivanna #Shivarajkumar #ShivuaDDa pic.twitter.com/YwLbBjiYlK
— ಶಿವು ಅಡ್ಡ™ | shivu aDDa™ (@shivuaDDa) January 26, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




