Shilpa Shetty: ‘నా భార్యను లాగొద్దు.. త్వరలోనే నిజం బయట పడుతుంది’.. ఈడీ దాడులపై శిల్పా శెట్టి భర్త

|

Nov 30, 2024 | 6:07 PM

మనీ లాండరింగ్, అశ్లీల చిత్రాల నిర్మాణానికి సంబంధించి రాజ్ కుంద్రాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు చేశారు. తాజాగా ఈ దాడులపై స్పందించారు రాజ్ కుంద్రా. ఈ కేసులో తన భార్యను శిల్పాశెట్టి పేరును ప్రస్తావించవద్దని అందరికీ విజ్ఞప్తి చేశారు.

Shilpa Shetty: నా భార్యను లాగొద్దు.. త్వరలోనే నిజం బయట పడుతుంది.. ఈడీ దాడులపై శిల్పా శెట్టి భర్త
Shilpa Shetty, Raj Kundra
Follow us on

బాలీవుడ్ ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ముఖ్యంగా మనీలాండరింగ్ కేసు రాజ్ కుంద్రాను నీడలా వెంటాడుతోంది. తాజాగా అతని ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు చేశారు. ఇల్లు, ఆఫీసుల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఇలా ఈడీ వరుసగా దాడులు చేయడంపై రాజ్ కుంద్రా స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని ఏదో ఒక రోజు రుజువు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే ఈ కేసులో తన భార్య శిల్పాశెట్టి పేరును లాగవద్దని అందరినీ అభ్యర్థించాడు. ‘ ఈడీ సోదాలకు సంబంధించి నేను సంబంధిత అందరితో నేరుగా మాట్లాడుతున్నాను. గత నాలుగేళ్లుగా జరుగుతున్న విచారణకు సహకరిస్తున్నాను. మనీ లాండరింగ్, అసభ్యకరమైన సినిమా నిర్మాణలు మొదలైన ఆరోపణలు నాపై ఉన్నాయి. ఏది సంచలనం చేసినా నిజం దాచలేరు. అంతిమంగా నిజం బయటపడాలి’ అని రాజ్ కుంద్రా చెప్పుకొచ్చాడు. కాగా ఇదే కేసులో శిల్పాశెట్టి పేరును కూడా లాగుతున్నారు. ఈ సందర్భంలో శిల్పాశెట్టి పాత్రపై చర్చ జరుగుతోంది. దీనిపై రాజ్‌కుంద్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధం లేని అంశాల్లో నా భార్య పేరును లాగొద్దని అభ్యర్థించాడు.

కాగా రాజ్ కుంద్రాపై ప్రస్తుతం పలు కేసులు ఉన్నాయి. గతంలో అతను అసభ్యకర సినిమా నిర్మాణంలో అరెస్టయ్యాడు. అతిపెద్ద బిట్‌కాయిన్ స్కామ్‌లో అతని పేరు కూడా వినిపిస్తోంది. ఈ స్కామ్ తో వందల కోట్ల రూపాయలను రాజ్ కుంద్రా వెనకేసినట్లు తెలుస్తోంది. రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి విడాకులు తీసుకుంటారని గతంలో వార్తలు వచ్చాయి. అసభ్యకరమైన సినిమా తీసిన కేసులో రాజ్ కుంద్రా అరెస్ట్ కావడంతో శిల్పాశెట్టి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీన్ని రాజ్‌కుంద్రా ఖండిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు చేసిన పోస్ట్‌లో తన తప్పేమీ లేదని క్లారిటీ ఇచ్చాడు రాజ్ కుంద్రా.

ఇవి కూడా చదవండి

పెళ్లి రోజు వేడుకల్లో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా..

కొద్ది రోజుల క్రితం రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి తమ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. తన స్నేహితులను ఆహ్వానించి భారీ పార్టీ ఇచ్చారు. విందులు, వినోదాలు నిర్వహించారు. ఇది జరిగిన కొన్ని రోజులకే రాజ్ కుంద్రాపై ఈడీ అధికారులు మెరుపు దాడులు చేశారు.

దీపావళి వేడుకల్లో శిల్పా శెట్టి ఫ్యామిలీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.