Maha Samudram: కరోనా ఎఫెక్ట్.. శర్వానంద్ మహాసముద్రం సినిమా రిలీజ్ ఇప్పట్లో లేనట్టేనా..?

యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం మహా సముద్రం. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే

Maha Samudram: కరోనా ఎఫెక్ట్.. శర్వానంద్ మహాసముద్రం సినిమా రిలీజ్ ఇప్పట్లో లేనట్టేనా..?
1

Edited By: Ravi Kiran

Updated on: Jul 21, 2021 | 11:55 AM

Maha Samudram: యంగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న తాజా చిత్రం మహా సముద్రం. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్ కూడా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఆర్ఎక్స్ 100 సినిమాతో అజయ్ భూపతి సంచలన విజయం అందుకున్నాడు. ఇప్పుడు మహాసముద్రం తో ప్రేక్షుకుల ముందుకు రాబోతున్నాడు. ఇది మల్టీస్టారర్ సినిమా కావడంతో, హీరోలను సెట్ చేసుకోవడానికి ఆయనకి చాలానే సమయం పట్టింది. ఈ సినిమా కథ పట్టుకొని చాలా మంది హీరోల చుట్టూ తిరిగాడు అజయ్. ఎట్టకేలకు శర్వానంద్ -సిద్ధార్థ్ ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విభిన్నమైన కథాకథనాలతో రూపొందుతోన్న ఈ సినిమాలో హీరోయిన్స్ గా అదితీరావు .. అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 19వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ సినిమా షూటింగ్ కు కరోనా బ్రేక్ వేయడంతో సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది. త్వరలోనే షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టనున్నారు. అయితే ఇక ఈ సినిమా రిలీజ్ వచ్చే ఏడాదికి మారిందని తెలుస్తుంది. వచ్చే ఏడాదిలోనే ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో చిత్రయూనిట్ ఉన్నారని తెలుస్తుంది. ఈ సినిమా విజయం పై చిత్రయూనిట్ ధీమాగా ఉన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Theaters Parking: ఇకపై థియేటర్ల వద్ద మళ్లీ పార్కింగ్ చార్జీలు.. కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం..

Needa AHA: ఆసక్తిని రేకెత్తిస్తోన్న నీడ ట్రైలర్‌.. ఆహాలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైన సస్పెన్స్‌ థ్రిల్లర్‌..