Sharwanand: శర్వానంద్- రక్షిత రెడ్డి పెళ్లి డేట్ ఫిక్స్ !.. మ్యారేజ్ ఎప్పుడు.. ఎక్కడంటే..
ఇంతవరకు వీరు పెళ్లి గురించి ఎలాంటి అప్డేట్ బయటకు రాకపోవడంతో పెళ్లి బ్రేక్ అయ్యిందనే వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ రూమర్స్ పై శర్వానంద్ టీమ్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరి పెళ్లి ఆగిపోలేదని.. వాళ్లిద్దరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు.

యంగ్ హీరో శర్వానంద్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలోనే యూఎస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న రక్షితారెడ్డితో నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఎంగేజ్‌మెంట్‌కు రామ్‌చరణ్, ఉపాసన, సిద్దార్థ్, అదితిరావు హైదరీ వంటి పలువురు సెలబ్రిటీలు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. అయితే వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగి దాదాపు ఐదు నెలలు కావాల్సి వస్తుంది. ఇంతవరకు వీరు పెళ్లి గురించి ఎలాంటి అప్డేట్ బయటకు రాకపోవడంతో పెళ్లి బ్రేక్ అయ్యిందనే వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ రూమర్స్ పై శర్వానంద్ టీమ్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరి పెళ్లి ఆగిపోలేదని.. వాళ్లిద్దరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు.
ప్రస్తుతం శర్వానంద్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడని.. ఇందుకు సంబంధించిన షూటింగ్స్ కారణంగా బిజీగా ఉన్నాడని.. ఇటీవలే లండన్లో 40 రోజుల షెడ్యూల్ పూర్తిచేసుకుని ఇండియాకు తిరిగి వచ్చాడని.. ప్రస్తుతం తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిన తర్వాతే పెళ్లి చేసుకోనున్నట్లు తెలిపారు. త్వరలోనే పెళ్లి డేట్ ప్రకటించనున్నట్లు తెలిపింది.




తాజాగా శర్వానంద్, రక్షితారెడ్డి పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. వచ్చే నెల 2 లేదా 3 తేదీలో రక్షితా మెడలో శర్వానంద్ మూడు మూళ్లు వేయనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి వివాహం జైపూర్ లోని లీలా ప్యాలెస్లో గ్రాండ్ గా జరగనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.