బాక్సాఫీస్‌పై ‘జవాన్’ దండయాత్ర కొనసాగుతోంది. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే కలెక్షన్ల పరంగా రోజుకొక రికార్డు బద్దలుకొడుతోంది. మొదటి వీక్‌లోనే రూ.500 కోట్లు వసూలు చేసిన షారుక్ సినిమా రెండో వారంలోనూ అదరగొడుతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ షారుక్ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. .బాక్సాఫీస్ దగ్గర పెద్దగా పోటీ లేకపోవడం, వీకెండ్స్, అలాగే గణేశ్ పండగ సెలవులు.. అన్నీ షారుక్ సినిమాకు కలిసి వస్తున్నాయి. ఇక 9 రోజులకు కలిపి ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 735. 02 కోట్లు వసూలు చేసింది జవాన్ సినిమా. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు జవాన్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్. వీకెండ్స్‌తో పాటు సెలవులు ముగిసే సరికి జవాన్ రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశముందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా ఈ ఏడాది పఠాన్‌తో ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు షారుక్. ఇప్పుడు జవాన్ కూడా రికార్డు స్థాయి వసూళ్లు సాధించడంతో 2023 సంవత్సరం షారుక్‌కు ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోతుందని చెప్పవచ్చు. అట్లీ తెరకెక్కించిన ఈ మల్టీస్టారర్‌గా మూవీలో ‘జవాన్’ సినిమాలో షారుఖ్ సరసన నయనతార నటించింది. అలాగే దీపికా పదుకొనే, ప్రియమణి, విజయ్ సేతుపతి, సునీల్ గ్రోవర్, యోగిబాబు వంటి టాలెంటెడ్ నటీనటులు వివిధ పాత్రల్లో కనిపించారు.
షారుక్ సొంత బ్యానర్ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై గౌరీఖాన్ జవాన్ సినిమాను నిర్మించారు. అనిరుధ్ స్వరాలు సమకూర్చారు. సామాన్యులకే కాదు సెలబ్రిటీలు కూడా ‘జవాన్’ సినిమా తెగ నచ్చేసింది. టాలీవుడ్ సెలబ్రిటీలు మహేశ్ బాబు, అల్లు అర్జున్, రాజమౌళి తదితరులు జవాన్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. సెప్టెంబర్ 7వ తేదీ వరకు ‘గదర్ 2’ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. అయితే ‘జవాన్’ సినిమా విడుదలయ్యాక ‘గదర్ 2’ వసూళ్లు బాగా తగ్గిపోయాయి. జవాన్ సక్సెస్‌ను పురస్కరించుకుని శుక్రవారం (సెప్టెంబర్15) సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. షారుక్ ఖాన్, దీపికా పదుకొణె, విజయ్ సేతుపతి, సాన్యా మల్హోత్రా, డైరెక్టర్ అట్లీ, ప్రియమణి, సునీల్ గ్రోవర్ తదితరులు ఈ ఫంక్షన్‌లో సందడి చేశారు. జవాన్‌లోని పాటలకు తమదైన స్టెప్పులు వేసి ఆహూతులను అలరించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.