Dunki Movie: ఇదెక్కడి మాస్ మామ.. హైదరాబాద్‌లో షారుఖ్ మూవీ మేనియా.. గంటలోనే అన్ని వేల టికెట్లు..
డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్ కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో చాలా కాలం తర్వాత కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాడు షారుఖ్. దీంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ 21న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా మేకర్స్ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్నాడు. ఈ ఏడాది బాద్ షాకు కలిసొచ్చిందనే చెప్పాలి. పఠాన్, జవాన్ సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి. ఇప్పుడు డంకీ సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్ కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో చాలా కాలం తర్వాత కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాడు షారుఖ్. దీంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ 21న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా మేకర్స్ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ సమయంలోనే షారుఖ్ కాన్ శనివారం ఓ విషయాన్ని వెల్లడించారు. “డంకీ” సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ అధికారికంగా ప్రారంభమైనట్లు తెలిపాడు షారుఖ్.
అయితే షారుఖ్ ఖాన్కు సౌత్ ఇండస్ట్రీలో భారీ ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన జవాన్ సినిమాకు తెలుగులో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు డంకీ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. శనివారం నుంచి హైదరాబాద్ అభిమానులు సైతం ఇప్పుడు ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు. ముందుగా సినిమాను చూడాలనుకునే వారు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు. అయితే హైదరాబాద్ నగరంలో టిక్కెట్ల ధర రూ.350 నుండి రూ. 250 వరకు ఉన్నట్లు సమాచారం.
Isse pehle ki Hardy cinemas mein pahoch jaaye… Aur saare shows houseful ho jaaye… Aap apni tickets book karlo! Kyun ki jab Hardy aur uske yaar ayenge, sabke dil Lutt Putt jayenge…
Advance bookings for Dunki are open now!https://t.co/va0QwZtXml#Dunki releasing… pic.twitter.com/9nMYgsgVz7
— Shah Rukh Khan (@iamsrk) December 16, 2023
నివేదికల ప్రకారం ఇప్పటివరకు హైదరాబాద్‌లో 3.39 వేల కంటే ఎక్కువ టిక్కెట్లు అమ్ముడయ్యాయట.. BookMyShow ప్రకారం 298.1 వేల కంటే ఎక్కువ మంది సినిమా చూడటానికి ఆసక్తి చూపారని తెలుస్తోంది. దీంతో మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీలో షారుఖ్ మూవీ మేనియా ఏ రేంజ్లో ఉందో అర్థమవుతుంది. జవాన్, పఠాన్ తర్వాత షారుఖ్ నటిస్తున్న ఈ సినిమా ఏరేంజ్ హిట్ అవుతుందో చూడాలి.
Bhaag-bhaag kar aa raha hoon aapse milne, Aur lagane tent aap sab ke dil mein.. Toh ji advance bookings jaldi karlo yaar, Kyun ki Dunki ke liye din bache hai only chaar!
Only 4 days to go for #Dunki
Advance bookings open, so book your tickets now!https://t.co/va0QwZtpwN pic.twitter.com/t4tHqkh8z0
— Shah Rukh Khan (@iamsrk) December 17, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
