Jr.NTR: ఆ డైరెక్టర్ మాస్టర్ ప్లాన్.. ఎన్టీఆర్ సినిమాలో షారుఖ్ ఖాన్.. కొత్త అప్డేట్ అదిరింది గురూ..

|

Oct 22, 2024 | 12:55 PM

‘వార్’ సినిమా సక్సెస్ తర్వాత యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ ‘వార్ 2’ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, కియారా అద్వానీ నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి యాక్షన్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ఈ సినిమాలో హృతిక్ అతిథి పాత్రలో కనిపించనున్నాడని సమాచారం.

Jr.NTR: ఆ డైరెక్టర్ మాస్టర్ ప్లాన్.. ఎన్టీఆర్ సినిమాలో షారుఖ్ ఖాన్.. కొత్త అప్డేట్ అదిరింది గురూ..
Jr.ntr, Shah Rukh Khan
Follow us on

ఇటీవలే దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు హిందీలో వార్ 2 చిత్రంలో నటిస్తున్నాడు తారక్. ‘వార్’ సినిమా సక్సెస్ తర్వాత యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ ‘వార్ 2’ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, కియారా అద్వానీ నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి యాక్షన్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ఈ సినిమాలో హృతిక్ అతిథి పాత్రలో కనిపించనున్నాడని సమాచారం.

ఇక ఈ సినిమా కోసం యష్ రాజ్ ఫిల్మ్స్ భారీ పెట్టుబడి పెడుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను ముంబైలో చిత్రీకరిస్తున్నారు. 40 మందికి పైగా జూనియర్ ఎన్టీఆర్ ఫైట్ చేసే సీన్ ఉంటుందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలో హృతిక్ పాత్ర హైలెట్ అయింది. కానీ జూనియర్ ఎన్టీఆర్ పాత్ర అలా కాదు. ఈ మూవీలో తారక్ పాత్రను మరింత హైలైట్ చేయడం అత్యవసరం. అందుకే తారక్ పాత్రను పూర్తిగా రా పాత్రలో చూపించాలనుకుంటున్నాడట. మూడు రోజుల పాటు షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రీకరణలో బిల్డప్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తి కానుంది.

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోన్న ఈ స్పై యూనివర్స్ లో వచ్చిన వార్, పఠాన్, టైగర్ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఇప్పుడు వార్ 2 చిత్రంలో షారుఖ్ ఖాన్ అతిధి పాత్రలో కనిపించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వార్ 2 చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది మే నెలాఖరులోగా షూటింగ్‌ని పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 2025లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది.

ఇది చదవండి : Tollywood: వణుకుపుట్టించే థ్రిల్లర్ మూవీ.. ఈ సినిమాను అస్సలు మిస్సవద్దు..

Tollywood: ఈ అరాచకం ఏందీ సామి.. ఎన్టీఆర్‏తో కలిసి నటించిన ఈ హీరోయిన్ ఇలా మారిపోయిందేంటీ.. ? ఇప్పుడు చూస్తే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.