ఫార్చ్యూన్ ఇండియా భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లించే సినీ ప్రముఖుల జాబితాను ప్రకటించింది. తమ నటనతో ప్రేక్షకుల హృదయాలను శాసించడమే కాకుండా, సకాలంలో పన్నులు చెల్లించడంలో కూడా ముందుండే నటులు భారతీయ సినిమాలో ఎందరో ఉన్నారు. ఇటీవల, ఫార్చ్యూన్ ఇండియా భారతదేశంలో అత్యధికంగా చెల్లించే బాలీవుడ్ ప్రముఖుల జాబితాను ప్రకటించింది మరియు ఇందులో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి చాలా మంది స్టార్స్ ఉన్నారు. ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దాదాపు రూ. 92 కోట్ల పన్నులు చెల్లించిన షారుక్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత తలపతి విజయ్ సుమారు రూ. 80 కోట్లు పన్నులు చెల్లించారు. ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో దాదాపు రూ.75 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించిన సల్మాన్ ఖాన్ మూడో స్థానంలో నిలిచాడు. ఇది కాకుండా, అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగన్, రణబీర్ కపూర్, హృతిక్ రోషన్ తదితర స్టార్ హీరోలు కూడా ఈ జాబితాలో ఉన్నారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి అల్లు అర్జున్ ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ఈ ఐకాన్ స్టార్ 2023-24లో ఏకంగా రూ. 14 కోట్ల మేర అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించినట్లు ఫార్చూన్ ఇండియా నివేదిక తెలిపింది. టాప్ 20 జాబితాలో అల్లు అర్జున్ 16వ స్థానం చేజిక్కించుకున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే ప్రభాస్, మహేష్ బాబు వంటి హీరోల పేర్లు టాప్ 20 జాబితాలో లేకపోవడం.
ఫార్చ్యూన్ ఇండియా ప్రకారం, కరీనా కపూర్ గత ఆర్థిక సంవత్సరంలో రూ. 20 కోట్ల పన్ను చెల్లించి జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచింది.ఇక కియారా అద్వానీ 12 కోట్లతో 14వ స్థానంలో ఉండగా, కత్రినా కైఫ్ 11 కోట్లు చెల్లించి టాప్ 20 లో స్థానం సంపాదించింది.
.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.