
ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ జరుగుతుంది. క్రికెట్ అభిమానులకు రోజుకొక పండగనే చెప్పాలి. ఈ సారి ఐపీఎల్ కప్పు ఎవరు సొంతం చేసుకుంటారా అని అభిమానులంతా ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే టీమ్స్ అన్ని గ్రౌండ్ లో గట్టిగానే పోటీపడుతున్నాయి. ఇదిలా ఉంటే ‘కేకేఆర్'( కోల్‌కత్తా నైట్ రైడర్స్) టీమ్ కు బాలీవుడ్ కింగ్ షారూఖ్ ఖాన్ ఓనర్ అని తెల్సిందే. సోమవారం (ఏప్రిల్ 29) ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో కోల్‌కత్తా జట్టు విజయం సాధించింది. షారుఖ్ ఖాన్ తన చిన్న కొడుకు అబ్రామ్‌తో కలిసి మ్యాచ్‌ని వీక్షించారు. ఈ మ్యాచ్ లో అద్భుత ప్రదర్శనతో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. కాగా ఏప్రిల్ 29 ఆండ్రీ రస్సెల్ పుట్టినరోజు జరుపుకున్నాడు. రస్సెల్ పుట్టిన రోజుతో పాటు మ్యాచ్ కూడా విన్ అవ్వడంతో కేకేఆర్ టీమ్ సెలబ్రేట్ చేసుకున్నారు.
రస్సెల్ బర్త్ డేను షారుఖ్ ఖాన్ సెలబ్రేట్ చేశారు. షారుక్ కుమారుడు అబ్రామ్ రస్సెల్ బర్త్ డేను సందడిగా సెలబ్రేట్ చేశారు. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు అధికారిక ఖాతా రస్సెల్ పుట్టినరోజు వేడుకల వీడియోను షేర్ చేసింది. ఇందులో షారుఖ్ ఖాన్ ,అబ్రామ్ ఇతర పిల్లలలు ఈ వేడుకలో పాల్గొన్నారు. షారుఖ్ ఖాన్ రస్సెల్‌ను కౌగిలించుకుని విష్ చేశాడు. ఇద్దరూ కలిసి ఫోటోలు దిగారు. ఈ వీడియోలో అబ్రామ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. సునీల్ నరైన్ దానిని రస్సెల్ తలకు పూశాడు. దీంతో అక్కడే ఉన్న అబ్రామ్ వచ్చి రస్సెల్ చెంపపై కేక్ రాశాడు. ఈ వీడియోఇప్పుడు వైరల్ గా మారింది. మరో వీడియోలో రింకూ సింగ్‌కి అబ్రామ్ బౌలింగ్ చేస్తూ కనిపించాడు. షారుక్ సినిమాల విషయానికొస్తే.. గతేడాది షారుక్ ఖాన్ నటించిన మూడు సినిమాలు (పఠాన్, జవాన్, డాంకీ) విడుదలయ్యాయి. ఈ మూడూ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.
The celebration couldn’t get better than this 💜 pic.twitter.com/ZYZammiuDG
— KolkataKnightRiders (@KKRiders) April 29, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.