
సినిమాలతో సమానంగా సీరియల్స్‌కు కూడా మంచి క్రేజ్ ఉంటుంది. అలాగే సినీ సెలబ్రెటీలకు ఏ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంటుంది సీరియల్ యాక్టర్స్‌కు కూడా అదే రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంటుంది. ఇక సీరియల్స్ లో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్ బ్రహ్మముడి. ఈ సీరియల్‌కు చాలా ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సీరియల్‌లోని ప్రతి క్యారెక్టర్‌కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కావ్య , కనకం, కృష్ణమూర్తి, స్వప్న, అప్పూ, అపర్ణ, సుభాష్, ఇందిర, సీతారామయ్య, ప్రకాశం, ధాన్యలక్ష్మీ, రుద్రాణి, రాహుల్, కళ్యాణ్ , అనామిక ఇలా ఈ సీరియల్‌లో నటించిన అందరి పాత్రలు అభిమానులకు బాగా గుర్తుండిపోయాయి. ఇక ఈ సీరియల్ లో స్వప్న అనే పాత్ర కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.
ఆ పాత్రలో మొన్నటి వరకూ.. హమీదా ఖాతూన్ నటించింది. కానీ ఇప్పుడు ఆమె ప్లేస్ లోకి మరో నటి వచ్చింది. బ్రహ్మముడి సీరియల్ లో స్వప్న పాత్రలో రూప ముగ్గల్ల నటిస్తుంది. రూప ముగ్గల్ల బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలే..ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రీల్స్ , ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.
రూప ముగ్గల్ల షేర్ చేసే రీల్స్ కు సోషల్ మీడియాలో యమా క్రేజ్ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ ఫోటోలు, వీడియోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. అందచందాలతో కుర్రకారును కట్టిపడేస్తుంది రూప. తాజాగా షేర్ చేసిన వీడియోకు ఓ అభిమాని “మీరు తెలుగు దివ్యభారతి” అని రాసుకొచ్చాడు. మరొకరు “ఆ కళ్ళలోనే ముగ్గులు కనిపిస్తున్నాయి” అని కామెంట్స్ చేశాడు. ఇప్పుడు ఈ అమ్మడి ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.