Mega 154: మెగా 154లో అలనాటి హీరోయిన్.. చిరుకు.. రవితేజకు మధ్య ఆమె పాత్రే కీలకం..

|

Jul 19, 2022 | 9:11 AM

అయితే ఇటీవలే రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభించుకున్న మెగా 154 చిత్రం గురించి ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.

Mega 154: మెగా 154లో అలనాటి హీరోయిన్.. చిరుకు.. రవితేజకు మధ్య ఆమె పాత్రే కీలకం..
Mega 154
Follow us on

ఇటీవలే ఆచార్య సినిమాతో థియేటర్లలో సందడి చేశారు మెగాస్టార్ చిరంజీవి  (Megastar Chiranjeevi). రామ్ చరణ్, చిరు కలిసి నటించిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో చిరు తన రాబోయే చిత్రాలపై మరింత ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గాడ్ ఫాదర్, భోళా శంకర్, మెగా 154 షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఇటీవలే రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభించుకున్న మెగా 154 చిత్రం గురించి ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.

డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మాస్ మాహారాజా కీలకపాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్‏లోనూ జాయిన్ అయ్యారు మాస్ మాహారాజా. ఆయనకు సంబంధించిన స్పెషల్ వీడియోను సైతం రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇక ఇప్పుడు ఈ సినిమాలో అలనాటి హీరోయిన్ సుమలత సైతం కీలకపాత్రలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇందులో రవితేజకు తల్లిగా ఆమె కనిపించనుందట. ఆమె కోసం రవితేజ ఎంతో స్ట్రగుల్ అవుతాడని.. ఈ క్రమంలోనే చిరుతో రవితేజకు అనుబంధం ఏర్పడుతుందని తెలుస్తోంది. ఇక ఇంటర్వెల్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ లో రవితేజ పాత్ర రివీల్ అవుతుందని.. ఇందులో ఆయన మరింత ఫవర్ ఫుల్ గా కనిపించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం రవితేజ, చిరంజీవి మధ్య వచ్చే కీలక సన్నివేశాలపై షూట్ జరుగుతుందట. ఈ చిత్రంలో చిరు సరసన శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా.. మెగా 154 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు మేకర్స్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.