Indraja: యూత్‌, పెద్ద‌లు మెచ్చేలా త‌ల్లి, కొడుకు రిలేష‌న్‌ను `స్టాండప్ రాహుల్`లో చూడొచ్చు.. ఇంద్రజ కామెంట్స్ వైరల్..

|

Mar 10, 2022 | 7:42 PM

హీరో రాజ్ తరుణ్, వ‌ర్ష బొల్ల‌మ్మ జంట‌గా న‌టించిన సినిమా `స్టాండప్ రాహుల్` (Standup Rahul). కూర్చుంది చాలు అనేది ట్యాగ్‌లైన్‌.

Indraja: యూత్‌, పెద్ద‌లు మెచ్చేలా త‌ల్లి, కొడుకు రిలేష‌న్‌ను `స్టాండప్ రాహుల్`లో చూడొచ్చు.. ఇంద్రజ కామెంట్స్ వైరల్..
Indraja
Follow us on

హీరో రాజ్ తరుణ్, వ‌ర్ష బొల్ల‌మ్మ జంట‌గా న‌టించిన సినిమా `స్టాండప్ రాహుల్` (Standup Rahul). కూర్చుంది చాలు అనేది ట్యాగ్‌లైన్‌. శాంటో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాను డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్ల‌పై నంద కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించారు. అన్ని కార్య‌క్ర‌మాలు ముగించుకుని ఈనెల 18న విడుద‌ల‌కాబోతుంది. ఈ సంద‌ర్భంగా గురువారం సీనియ‌ర్ న‌టి ఇంద్ర‌జ మీడియా స‌మావేశంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె ప‌లు విష‌యాలు తెలియ‌జేశారు.

– ద‌ర్శ‌కుడు శాంటో నాకు ఫోన్‌ లోనే క‌థ చెప్పారు. చాలా ఆస‌క్తిగానూ స‌రికొత్త‌గానూ అనిపించింది. స‌హ‌జంగా త‌ల్లీ, కొడుకుల మ‌ధ్య రిలేష‌న్, మాట‌లనేవి తండ్రిని స‌పోర్ట్‌గా మాట్లాడ‌డం వుంటాయి. కానీ ఈ క‌థ‌లో ద‌ర్శ‌కుడు త‌ల్లి ప్రాధాన్య‌త కుటుంబంలో ఎంత వుంటుందో చ‌క్క‌గా చెప్పాడు.

– ముర‌ళీ శ‌ర్మ నా భ‌ర్త‌గా న‌టించారు. కానీ ఇంటి బాధ్య‌త నేనే తీసుకుంటాను. భ‌ర్త ద‌గ్గ‌ర ‌లేని క్వాలిటీని కొడుకు ద‌గ్గ‌ర చూడాల‌ని చిన్న‌ప్ప‌టి నుంచీ జాగ్ర‌త్త‌గా పెంచుతుంది. అయినా త‌ను తండ్రిలాగానే వున్నాడ‌ని తెలిసి బాధ‌ప‌డుతుంది. చివ‌రికి కుమారుడు త‌ల్లిని ఏవిధంగా అర్థం చేసుకున్నాడ‌నే ముగింపు చాలా బాగుంటుంది.

– స‌పోర్టింగ్ పాత్ర‌ల‌నేవి మ‌గ‌వారికి బాగానే వ‌స్తున్నాయి. మ‌హిళ‌ల‌కు స‌రైన పాత్ర‌లు రావ‌డంలేదు. అందుకే నాకు సినిమాల‌లో చాలా గ్యాప్ వ‌చ్చింది. స‌రైన పాత్ర‌లు రాక‌పోవ‌డం ఒక కార‌ణం. రొటీన్ పాత్ర‌లే రావ‌డంతో కొన్ని వ‌దులుకున్నా.

– ఈ సినిమాను యూత్‌ తోపాటు త‌ల్లిదండ్రులు కూడా త‌ప్ప‌నిస‌రిగా చూసేవిధంగా వుంటుంది. ఇందులో రెండు అంశాలు ద‌ర్శ‌కుడు బాగా చెప్పాడు. యూత్ ప‌ని, ప్యాషన్ అనే అంశాలకు ఏదో ఒక దానికోసం క‌ష్ట‌ప‌డుతుంటారు. అలా కాకుండా త‌మ‌కిష్ట‌మైన ప‌నిని చేస్తూనే ఎలా బ‌త‌క‌వ‌చ్చో ఈ సినిమాలో చూపించారు.

– భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య రిలేష‌న్ ఎలా వుండాలి. ఇప్పుడు పిల్ల‌ల‌తో క‌మ్యూనికేష‌న్ గ్యాప్ కూడా వుంది. అందుకే ఇప్పుడున్న జ‌న‌రేష‌న్‌కు అర్థ‌మ‌య్యేలా పాజిటివ్‌గా ద‌ర్శ‌కుడు చెప్పాడు.

– నేను `శ‌త‌మానంభ‌వ‌తి, శ‌మంత‌క‌మ‌ణి చేశాను. ఆ త‌ర్వాత మూడు సినిమాలు చేశాను. ఏదైనా సినిమా హిట్ అయితే ఆ ప్ర‌భావం న‌టుల‌పై ప‌డుతుంది. అవ‌కాశాలు వ‌స్తాయి.

– మేము ఒక‌ప్పుడు పెద్ద ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేశాం. వారి నుంచి ప‌రిశీల‌న‌లోనే చాలా నేర్చుకున్నాం. కానీ ఇప్ప‌టి జ‌న‌రేష‌న్ కొత్త‌గా వ‌చ్చేవారికి అన్నీ విష‌యాలు తెలిసే వ‌స్తున్నారు. న‌టిగా వారికి నేను స‌ల‌హాలు ఇచ్చే స్థితిలో లేను.

– కొత్త ద‌ర్శ‌కుల్లో చాలామంది ప్ర‌తిభ‌ గ‌ల‌వారు ఈ రంగంలోకి వ‌చ్చేశారు. ఒక్కో ద‌ర్శ‌కుడికి ఒక్కో శైలి. ఆయ‌న విజ‌న్లో ఏది వుందో దాన్ని బ‌ట్టి మేం న‌టిస్తాం. ఎటువంటి స‌ల‌హాలు ఇవ్వం.

– న‌టిగా సంతృప్తి అనేది ఎవ‌రికీ వుండ‌దు. న‌టిగా చేసింది గోరంత‌. చేయాల్సింది కొండంత‌. వ‌చ్చిన అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకుంటూ సాగ‌డ‌మే ప్రస్తుతం మా ముందున్న కర్త‌వ్యం.

– న‌దియా, ఖష్బూ, రోజా, ఆమ‌ని వారంతా మాకు సీనియ‌ర్లు. ర‌వ‌ళి, సంఘ‌వి మా త‌రం. మాకూ మంచి పాత్ర‌లు చేయాల‌నుంటుంది. అవ‌కాశాలు వ‌స్తే త‌ప్ప‌కుండా చేస్తాం.

– తాప్సీ, స‌మంత వంటి వారు లేడీ ఓరియెంట్ పాత్ర‌లు చేస్తున్నారంటే అంత‌కుముందు దాదాపు అన్ని త‌ర‌హా పాత్ర‌లు వారు పోషించేశారు. న‌టికి ప‌రిమితులు వుండ‌వు.

– చాలా మంది న‌టీమ‌ణులున్నారు. కాంపిటీషన్ వుంది. అమ్మ‌, అక్క‌, వ‌దిన పాత్ర‌లు చేసేవారు చాలా మంది వున్నారు. బెట‌ర్ అవ‌కాశం రావ‌డ‌మూ అదృష్టంగా భావిస్తా.

– నేను కొత్త‌వి మూడు సినిమాలు చేశాను. అవి విడుద‌ల‌కు ద‌గ్గ‌ర‌గా వున్నాయి. క‌న్న‌డ కిశోర్‌తో సినిమా చేశాను. ఇప్పుడు నితిన్‌తో సినిమా చేస్తున్నా అని తెలిపారు.

Also Read: Sitara Gattamaneni: సితారలో ఈ టాలెంట్ కూడా ఉందా ?.. ఏకంగా బుర్జ్ ఖలీఫానే..

Rashmi Gautham: క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన రష్మి.. తేలికగా ఆ మాటలు అనేస్తుంటారు అంటూ..

Bheemla Nayak: భీమ్లా నాయక్ సినిమాను అందుకే తొందరగా రిలీజ్ చేశారా ?.. క్లారిటీ ఇదేనా…

ET Movie Review: నారీలోకానికి అవగాహన కల్పించే ప్రయత్నం చేసిన ఈటీ!..