Ramya Krishnan: రిపబ్లిక్ లో పవర్ ఫుల్ పాత్రలో రాజమాత.. సాయి ధరమ్ తేజ్ కు సవాల్ విసురుతున్న రమ్యకృష్ణ

సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ క్రేజ్ ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. అప్పట్లో గ్లామరస్ హీరోయిన్ గా రాణించారు. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో ఆచి తూచి సినిమాలు ఎంచుకుంటూ.. దూసుకుపోతున్నారు.

Ramya Krishnan: రిపబ్లిక్ లో పవర్ ఫుల్ పాత్రలో రాజమాత.. సాయి ధరమ్ తేజ్ కు సవాల్ విసురుతున్న రమ్యకృష్ణ
Ramyakrishna

Updated on: Jul 03, 2021 | 1:43 PM

Ramya Krishnan:

సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ క్రేజ్ ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. అప్పట్లో గ్లామరస్ హీరోయిన్ గా రాణించారు. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో ఆచి తూచి సినిమాలు ఎంచుకుంటూ.. దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో రామకృష్ణ చూపించిన అభినయం సినిమాకే హైలైట్ అని చెప్పాలి. రాజమాత శివగామి పాత్రలో రమ్య కృష్ణ నటన ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇక ఇప్పుడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సినిమాలో చేస్తున్నారు రమ్యకృష్ణ. దర్శకుడు దేవాకట్ట తో సాయి ధరమ్ తేజ్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు రిపబ్లిక్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కనుందని తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నారని తెలుస్తుంది. రిపబ్లిక్ సినిమాలో రమ్యకృష్ణ అనే రాజకీయ నాయకురాలుగా నటిస్తున్నారు. అలాగే ఆమె పేరు సినిమాలో విశాఖ వాణి అని టాక్.

ఇక రిపబ్లిక్ సినిమాలో సాయితేజ్ – రమ్యకృష్ణ  మధ్య సన్నివేశాలు చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటాయని అంటున్నారు. అహంకారంతో కూడిన అధికారానికి .. బాధ్యతతో మెలిగే అధికారానికి మధ్య జరిగే పోరాటం చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుందని ఫిలింనగర్ లో టాక్.  తేజ్ సరసన ఐశ్వర్య రాజేశ్ నటిస్తుండగా ముఖ్యమైన పాత్రలో జగపతిబాబు కనిపించనున్నాడు.  అలాగే మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Kudi Yedamaithe : ‘ఆహా’ అనిపించేలా అమలాపాల్ వెబ్ సిరీస్.. ఆద్యంతం ఆసక్తికరంగా టీజర్

Aamir Khan: సినిమాల్లో మిస్టర్‌ పర్ఫెక్ట్.. రియల్ లైఫ్‌లో మిస్టర్ బ్రేకప్స్‌.. రెండో భార్యతో విడిపోయిన అమీర్ ఖాన్

Cinematograph Act: సినిమాటోగ్రఫీ చట్ట సవరణపై తీవ్రమవుతోన్న వ్యతిరేకత.. కేంద్రానికి తమ అభ్యంతరాలు తెలియజేసిన..

Karthika Deepam: సౌందర్యకు, దీపకు పెళ్లి బట్టలు కొన్న మోనిత.. తనకు చిరాకు తెప్పిస్తే.. రచ్చరచ్చ చేస్తానంటూ కార్తీక్ కు వార్నింగ్