Trisha Krishnan: స్టార్ హీరోకు తన ఇల్లు అమ్మేసిన త్రిష.. ఆయన ఎవరో తెలుసా..?

|

Sep 12, 2024 | 9:03 AM

ఒకానొక సమయంలో టాలీవుడ్ ను ఏలింది ఈ అమ్మడు. స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి మెప్పించింది. ఇండస్ట్రీలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ నుంచి ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మారిపోయింది త్రిష. కెరీర్ బిగినింగ్‌లో త్రిష సిమ్రాన్ ఫ్రెండ్‌గా ఓ సినిమా చేసింది. ఆతర్వాత మెల్లగా హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది. ఆతర్వాత స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంది.

Trisha Krishnan: స్టార్ హీరోకు తన ఇల్లు అమ్మేసిన త్రిష.. ఆయన ఎవరో తెలుసా..?
Trisha
Follow us on

అందాల భామ త్రిష.. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. ఒకానొక సమయంలో టాలీవుడ్ ను ఏలింది ఈ అమ్మడు. స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి మెప్పించింది. ఇండస్ట్రీలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ నుంచి ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మారిపోయింది త్రిష. కెరీర్ బిగినింగ్‌లో త్రిష సిమ్రాన్ ఫ్రెండ్‌గా ఓ సినిమా చేసింది. ఆతర్వాత మెల్లగా హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది. ఆతర్వాత స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది త్రిష. తెలుగుతో పాటు తమిళ్‌లోనూ సినిమాలు చేసింది ఈ చిన్నది. ప్రస్తుతం త్రిష ఆచి తూచి సినిమాలు చేస్తోంది. ఇటీవలే పొన్నియన్ సెల్వన్, లియో సినిమాలతో హిట్స్ అందుకుంది. ప్రస్తుతం అజిత్ తో ఓ సినిమా టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేస్తోంది త్రిష.

ఇది కూడా చదవండి : Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి.. ఈ ఫొటోలో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా..?

ఇదిలా ఉంటే త్రిషకు సంబందించిన ఓ న్యూస్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. త్రిష కోట్ల ఆస్తి సంపాదించింది. అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్స్ లో త్రిష ఒకరు. ఇదిలా ఉంటే త్రిష ఇంట్లో ఇప్పుడు ఓ సీనియర్ హీరో ఉంటున్నారు. ఆయన ఎవరో కాదు ఒకప్పుడు హీరోగా రాణించి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆకట్టుకుంటున్న భాను చందర్.

ఇది కూడా చదవండి :దైర్యం ఉంటేనే చూడండి..! థియేటర్ నుంచి జనాలు పారిపోయిన సినిమా ఇది..

చెన్నైలో భాను చందర్ ప్రస్తుతం ఉంటున్న ఇల్లు స్టార్ హీరోయిన్ త్రిషది. త్రిష తన ఇంటిని భానుచందర్ కు  అమ్మింది. ఆ ఇంటిని ఇప్పుడు భాను చందర్ అందంగా తీర్చిదిద్దారు. రీసెంట్ గా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భానుచందర్ మాట్లాడుతూ.. తన ఇంటి గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు. తన ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే మినీ బార్ దర్శనమిస్తుంది. అయితే అక్కడ అన్ని ఖాళీ బాటిల్స్ మాత్రమే ఉన్నాయి. అదేంటి అని అడగ్గా.. నేను మద్యం మానేసి దాదాపు 20 ఏళ్ళు అవుతుంది. అప్పియరెన్స్ కోసమే వాటిని అక్కడ ఉంచాను అని తెలిపారు భాను చందర్. ఇక ఇంటి చుట్టూ తన భార్య పచ్చని మొక్కలతో నింపేశారు అని తెలిపారు. అలాగే త్రిష ఎప్పుడైనా కనిపిస్తే నా ఇల్లు ఎలా ఉంది అని అడుగుతుంది అని చెప్పుకొచ్చారు భాను చందర్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.