Sudha: నా కళ్ళ ముందు పెరిగిన పిల్లాడు.. ఇప్పుడు ఇంత పెద్ద హీరో అయ్యాడు..

తెలుగు సినిమా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున నటీమణులలో సుధ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో కీలకపాత్రలు పోషించి ప్రేక్షకులకు దగ్గరయ్యింది. వెండితెర పై తన నటనతో అలరించిన ఆమె.. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు. అలాగే ఎంతో మంది హీరోలతో కలిసి నటించారు.

Sudha: నా కళ్ళ ముందు పెరిగిన పిల్లాడు.. ఇప్పుడు ఇంత పెద్ద హీరో అయ్యాడు..
Actress Sudha

Updated on: Apr 27, 2026 | 11:41 AM

సీనియర్  నటి సుధ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి ఆకట్టుకున్నారు ఆమె. సహాయక పాత్రల్లో నటిస్తూ తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్నారు సుధ. కాగా గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం, వివిధ తారలతో తన అనుభవాల గురించి పంచుకున్నారు. నటి సుధ తన కెరీర్‌లో నాలుగు తరాల నటులతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నారు. పెద్ద ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు వంటి దిగ్గజాలతో పాటు, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, అఖిల్, సుమంత్, సుశాంత్, అల్లు అర్జున్, వైష్ణవ్ తేజ్ వంటి ప్రస్తుత తరం స్టార్స్ తో కూడా ఆమె పనిచేశారు. చిరంజీవి గ్యాంగ్ లీడర్ చేసేటప్పుడు రామ్ చరణ్ చిన్న పిల్లాడని, పెద్ద ఎన్టీఆర్ మేజర్ చంద్రకాంత్ చేస్తున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చి కూర్చునేవాడని సుధ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

ఇది కూడా చదవండి :ఎంత బాగుంది మావ ఈ సాంగ్..! లవర్స్ తెగ పాడుకున్న పాట.. ఒక్కసారి వింటే మళ్లీ మళ్లీ వినాల్సిందే

అలాగే మహేష్ బాబు, మనోజ్ వంటి వారిని తాను స్వయంగా తినిపించిన రోజులు ఉన్నాయని, వీరందరూ తన పిల్లల లాంటి వారేనని ఆమె తెలిపారు. ఈ అదృష్టం చాలా తక్కువ మందికి దక్కుతుందని, వారి ఎదుగుదలను చూసి గర్వంగా ఉంటుందని సుధ అన్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిత్వం, ఆయన వినయం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తించాయి. ఎన్టీఆర్ చిన్ననాటి నుంచి తన కళ్ల ముందు పెరిగిన పిల్లవాడని, ఆయనను తన కొడుకులా చూస్తానని సుధ తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ స్వభావం గురించి మాట్లాడుతూ, ఒకప్పుడు చాలా అల్లరి పిల్లోడని, రాష్‌గా ఉండేవాడని ఆమె గుర్తుచేసుకున్నారు. కార్ వచ్చి ఆగింది అంటే తమ మీద పడి కొట్టేస్తాడేమో అనే భయం ఉండేదని, అంత వేగంగా ఉండేవాడని చెప్పారు. అయితే ఇప్పుడు తను చాలా ప్రశాంతంగా, ఎలా ఉండాలో, ఏ ఫ్యామిలీలో ఎలా వ్యవహరించాలో తెలిసిన వ్యక్తిగా మారిపోయాడని ప్రశంసించారు. అయినా, ఇప్పటికీ ఆ అల్లరి అలాగే ఉందని, పెద్దవాళ్ళ పట్ల గౌరవం మాత్రం మారలేదని సుధ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :Nagarjuna: ఇండస్ట్రీలో నాగార్జున అన్నయ్య అని పిలిచే ఏకైక నటుడు ఎవరో తెలుసా.?

బాద్షా సినిమాలోని ఒక పాట చిత్రీకరణ సమయంలో జరిగిన సంఘటనను సుధ గుర్తు చేసుకున్నారు. డ్యాన్స్ చేస్తున్నప్పుడు తన కాలు స్ప్రేయిన్ అవ్వగా, తనకున్న స్టేటస్ ను పట్టించుకోకుండా, జూనియర్ ఎన్టీఆర్ వెంటనే పరుగున వచ్చి తన కాలు పట్టుకుని స్ప్రే వేశాడని సుధ తెలిపారు. “నేను హీరోని.. నేను ఎందుకు చేయాలి?” అని చాలా మంది చూసి వెళ్లిపోయేవారని, కానీ ఎన్టీఆర్ అలా చేయలేదని, అది ఆయన డౌన్ టు ఎర్త్ నెస్ కు నిదర్శనమని సుధ కొనియాడారు. ఎన్టీఆర్ ఈరోజు పాన్ ఇండియా స్టార్ అయ్యారంటే అందుకు ఆయన వినయమే ఒక కారణం కావచ్చు అని ఆమె అన్నారు.

ఇది కూడా చదవండి : స్టార్ హీరోని పెట్టి సినిమా చేశా.. కానీ పక్కా ఫ్లాప్ అవుతుందని అప్పడే తెలిసిపోయింది..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us