AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Sarada: పెళ్లి వేడుకలో తళుక్కుమన్న సీనియర్ నటి శారద.. ఇప్పుడెలా ఉన్నారో చూశారా? వీడియో ఇదిగో

సీనియర్ నటి శారద సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటున్నారు. బయట కూడా పెద్దగా కనిపించడం లేదు. అయితే తాజాగా ఆమె ఓ పెళ్లి వేడుకలో తళుక్కుమన్నారు. మెగాస్టార్ చిరంజీవి- సురేఖ కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Actress Sarada: పెళ్లి వేడుకలో తళుక్కుమన్న సీనియర్ నటి శారద.. ఇప్పుడెలా ఉన్నారో చూశారా? వీడియో ఇదిగో
Actress Sarada
Basha Shek
|

Updated on: May 01, 2026 | 11:50 AM

Share

సీనియర్ హీరోయిన్ శారద గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వందలాది సినిమాల్లో నటించి మెప్పించారామె. మొదట హీరోయిన్ గా నటించిన ఆమె ఆ తర్వాత సహాయక నటిగా మారిపోయారు. తన నటనా ప్రతిభకు ప్రతీకగా ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా అందుకున్నారు. కేవలం తెలుగులోనే కాదు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారీ అందాల తార. తెలుగులో బలిపీళం, శారద, దాన వీర శూర కర్ణ, తెనాలి రామకృష్ణ, స్వయంవరం ,నిమజ్జనం , ఊర్వశి, ఇంద్ర ధనుస్సు, ప్రతిధ్వని, జస్టిస్‌ చౌదరి, అత్తా కోడళ్లు, సర్దార్‌ పాపారాయుడు, అమ్మ రాజీనామా, ఏవండి ఆవిడ వచ్చింది, మేజర్ చంద్రకాంత్, అంతఃపురం, స్టాలిన్‌, యోగి, సుకుమారుడు వంటి ఎన్నో మంచి పాత్రలతో మెప్పించారు శారద. కాగా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటున్నారు శారద. చివరిగా 2013లో సుకుమారుడు అనే సినిమాలో కనిపించారామె.

ఈ మధ్యన పెద్దగా బయట కనిపించని శారద తాజాగా ఓ పెళ్లి వేడుకలో తళుక్కుమన్నారు. ఇదే వేడుకకు మెగాస్టార్ చిరంజీవి- సురేఖ దంపతులు కూడా హాజరయ్యారు. శారదను చూసిన చిరంజీవి దంపతులు ఆమె దగ్గరకు వెళ్లి మాట్లాడారు. ఆమె యోగ క్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. సురేఖ కూడా శారదతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా శారద వయసు సుమారు 80 ఏళ్లు. ప్రస్తుతం ఆమె ఎక్కువగా ఇంట్లోనే ఉంటున్నారు. కాగా శారద రెండు సార్లు పెళ్లి చేసుకున్నారు అయినా పిల్లలు లేకపోవడంతో ప్రస్తుతం శారద చెన్నైలోని తన సోదరుడి కుటుంబంతో కలిసి జీవిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పెళ్లి వేడుకలో శారదతో మాట్లాడుతోన్న మెగాస్టార్ చిరంజీవి- సురేఖ దంపతులు.. వీడియో ఇదిగో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!