
సీనియర్ నటి పూజిత తన వివాహ జీవితంలో ఎదుర్కున్న ఇబ్బందులను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. నటిగా తాను ఫేస్ చేసిన సవాళ్లు, తన తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం ఆమె పడిన కష్టాలు గురించి పేర్కొంది. పెళ్లి అయిన మూడు నాలుగు రోజులకే తన భర్త విజయ గోపాల్ అప్పుల ఊబిలో కూరుకుపోయిన విషయాన్ని పూజిత గుర్తు చేసుకుంది. ఓ ప్రముఖ సంస్థలో పనిచేసిన అతడు డబ్బు కోసమే తనను పెళ్లి చేసుకున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. భర్త వ్యసనాలకు బానిస కావడంతో పాటు, ఇంట్లో ఉన్న రెండున్నర కోట్ల విలువైన బంగారం, నగదును కూడా దొంగిలించుకుపోయాడు. తన తండ్రికి ఇచ్చిన మాట కోసం 18 సంవత్సరాలు ఈ బంధాన్ని భరించినట్లు పూజిత తెలిపింది. తన కుమారుడి భవిష్యత్తు కోసం కష్టపడి నిలబడిన ఆమె.. తన కళ్ళలో కన్నీళ్లు ఇంకిపోయాయని పేర్కొంది.
ఇది చదవండి: ఆ డైరెక్టర్ ఇంటి గేటు దగ్గర ఛాన్స్‌లు కోసం నేను, చిరంజీవి వెయిట్ చేశాం.. ఓపెన్‌గా చెప్పిన టాలీవుడ్ హీరో
ఆర్థిక మోసాలతో పాటు తన భర్త సోషల్ మీడియా ద్వారా తొమ్మిది మంది మహిళలతో ఎఫైర్లు పెట్టుకున్నాడని పూజిత ఆరోపించింది. ఒకరోజు తాను షూటింగ్ నుంచి అలసి వచ్చి పడుకున్నప్పుడు.. భర్త ఫోన్లో పావని అనే మహిళ నుంచి వచ్చిన బెడ్‌రూమ్ సంబంధిత మెసేజ్‌లను చూసి ఈ విషయం తనకు తెలిసిందని ఆమె వివరించింది. తన తండ్రి మరణించిన తర్వాత తనలో ఉన్న దుఃఖం అంతా వెళ్లిపోయిందని, కన్నీళ్లు ఇంకిపోయాయని ఆమె పేర్కొంది. తన తండ్రి ‘అబ్బాయిలా’ పెంచాడని, ఆయనకు ఇచ్చిన మాట కోసం, బిడ్డ భవిష్యత్తు కోసం కష్టాలను భరించి నిలబడ్డానని పూజిత స్పష్టం చేసింది.
ఇది చదవండి: ఆరుగురు పతివ్రతలు చేశాక సినిమాలు ఆపేయడానికి కారణం ఇదే.. నిజాన్ని చెప్పిన సీరియల్ నటుడు
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..