AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Meena: “ఆ హీరో నా చేత స్విమ్‌సూట్ వేయించాడు”.. మీనా షాకింగ్ కామెంట్స్

సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది మెప్పించింది మీనా. తమిళ్ లో చాలా సూపర్ హిట్ సినిమాల్లో నటించింది మీనా . ఇక హీరోయిన్ గా తెలుగు, తమిళ్, కన్నడ , హిందీ భాషల్లో నటించి మెప్పించింది మీనా. తెలుగులో ఒకప్పటి స్టార్ హీరోలు అయిన చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున లతో నటించి మెప్పించింది.

Actress Meena: ఆ హీరో నా చేత స్విమ్‌సూట్ వేయించాడు.. మీనా షాకింగ్ కామెంట్స్
Actress Meena
Rajeev Rayala
|

Updated on: Jan 21, 2024 | 5:54 PM

Share

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో మీనా ఒకరు. తెలుగు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. హీరోయిన్ గా కంటే ముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా  సినిమాలు చేసింది మీనా. సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది మెప్పించింది మీనా. తమిళ్ లో చాలా సూపర్ హిట్ సినిమాల్లో నటించింది మీనా . ఇక హీరోయిన్ గా తెలుగు, తమిళ్, కన్నడ , హిందీ భాషల్లో నటించి మెప్పించింది మీనా. తెలుగులో ఒకప్పటి స్టార్ హీరోలు అయిన చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున లతో నటించి మెప్పించింది. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో 1991 నుంచి 2000 వరకూ, సుమారు ఒక దశాబ్దం పాటు అగ్రతారగా వెలిగింది మీనా.

మీనా ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. పెళ్లి తర్వాత ఆచితూచి సినిమాలు చేస్తోంది మీనా.  వెంకటేష్ నటించిన దృశ్యం, దృశ్యం2 సినిమాలో నటించారు మీన. ఇటీవలే ఆమె సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో నటించారు. ఇదిలా ఉంటే తాజాగా మీనా బోల్డ్ పాత్రల్లో నటించడం పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మీనాకు ఫ్యామిలీ హీరోయిన్ గా మంచి పేరుంది. ఆమె బోల్డ్ సీన్స్ లో నటించింది చాలా తక్కువ. అయితే తనకు బోల్డ్ పాత్రల్లో నటించడం, బికినీ లేదా స్విమ్ సూట్ లు ధరించి నటించడం ఇష్టముండదట. కానీ ఓ హీరో వల్ల స్విమ్ సూట్ లో నటించాల్సి వచ్చిందని తెలిపింది.

ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు అయిన ప్రభుదేవా ఓ సినిమా కోసం తనను స్విమ్ సూట్ వేసుకోవాలని చెప్పారని తెలిపారు మీనా.. ఇటీవల ఓ తమిళ్ మీడియాలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుదేవా సినిమా కోసం బోల్డ్ గా కనిపించాను. కానీ సిగ్గుతో మేకప్ రూమ్ వదిలి రాలేక పోయాను. ఇప్పుడు బోల్డ్ పాత్రల్లో నటిస్తున్న హీరోయిన్స్ కు దండం పెట్టాలి. ఎలా చేస్తున్నారో ఏంటో.. ఏదేమైనా బోల్డ్ పాత్రల్లో నటించడం నిజంగా చాలా కష్టమైన పని అని చెప్పుకొచ్చారు మీనా. ఇక 2009లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విద్యాసాగర్‌తో మీనా వివాహం జరిగింది. ఈ దంపతులకు నైనికా అనే కుమార్తె ఉంది. తేరీ (తెలుగులో పోలీస్) సినిమాలో నైనిక చైల్డ్ ఆర్టిస్ట్‌గా న‌టించింది. 2022లో కరోనా కారణంగా మీనా భర్త చనిపోయారు.

Meena

మీనా ఇన్ స్టా గ్రామ్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.