MAA Elections 2021: ఉత్కంఠంగా “మా” ఎన్నికలు.. నటుడు నరేష్ ప్రెస్‌మీట్‌కు దూరంగా జీవిత..
Naresh Press Meet: మా ఎన్నికలు.. సాధారణ రాజకీయ ఎన్నికలను గుర్తుచేస్తున్నాయి. ముందుగా ప్రకాశ్ రాజ్ అధ్యక్ష పదవి పోటీ చేస్తానని ప్రకటించడమే కాకుండా..
Naresh Press Meet: మా ఎన్నికలు.. సాధారణ రాజకీయ ఎన్నికలను గుర్తుచేస్తున్నాయి. ముందుగా ప్రకాశ్ రాజ్ అధ్యక్ష పదవి పోటీ చేస్తానని ప్రకటించడమే కాకుండా.. శుక్రవారం ఫిల్మ్ ఛాంబర్లో తన టీం సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ప్రకాశ్ రాజ్. అయితే ఇప్పుడు ప్రధానంగా మూవీ ఆర్టీస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న వాదన లోకల్.. నాన్ లోకల్. అయితే ఎప్పుడు లేని విధంగా ఈసారి ప్రాంతీయ బేధం కూడా రాజుకుంది. ఒకరిపై ఒకరు బహిరంగంగానే మాట్లాడుతున్నారు.
ఇక ప్రకాశ్ రాజ్ మీడియా సమావేశానికి కౌంటర్ ఇచ్చేందుకు శనివారం ఫిలిం ఛాంబర్ లో మా అధ్యక్షుడు నరేష్ తో కలిసి ప్రెస్ మీట్ పెట్టనున్నట్లుగా మీడియాకు జీవితా రాజశేఖర్ సమాచారం ఇచ్చారు. అయితే అనుహ్యంగా ఇంటర్వ్యూ స్పాట్ ను సూపర్ స్టార్ కృష్ణ ఇంటికి మార్చడం ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రెస్ మీట్ ప్లేస్ ఎందుకు మార్చారు అన్న సందేహం వ్యక్తమవుతున్న క్రమంలో లెటేస్ట్ అప్ డేట్ ప్రకారం ఇప్పుడు మరో చర్చకు దారి తీసింది. ముందుగా నరేష్, జీవిత కలిసి మీడియా సమావేశం ఉండబోతున్నట్లుగా సమాచారం రాగా.. ఇప్పుడు జీవిత.. నరేష్ ప్రెస్ మీట్ కు రాను అని షాక్ ఇచ్చిన్నట్లుగా తెలుస్తోంది. దీంతో నరేష్ మాత్రమే ప్రెస్ మీట్ ముందుకు వచ్చారు. నరేష్ ప్రెస్ మీట్ టీవీ9లో లైవ్ లో వీక్షించవచ్చు.
లైవ్…
Ram Gopal Varma: PM అయితే అలా చేస్తా … యాంకర్ ప్రశ్నకు షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన ఆర్జీవి..