Brahmamgari Matam: బ్రహ్మంగారి మఠం వివాదంలో మరో ట్విస్ట్.. అందరిది ఒకే అభిప్రాయమన్న ఎమ్మెల్యే రఘురామిరెడ్డి.. అవాస్తమన్న మహాలక్ష్మమ్మ

కడప: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. పీఠాధిపతి ఎంపికలో ఇంకా స్పష్టత రాలేదు.

Brahmamgari Matam: బ్రహ్మంగారి మఠం వివాదంలో మరో ట్విస్ట్.. అందరిది ఒకే అభిప్రాయమన్న ఎమ్మెల్యే రఘురామిరెడ్డి.. అవాస్తమన్న మహాలక్ష్మమ్మ
Brahmangari Math
Follow us

|

Updated on: Jun 26, 2021 | 11:30 AM

Brahmamgari Matam Pittadhipathi: కడప: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. పీఠాధిపతి ఎంపికలో ఇంకా స్పష్టత రాలేదు. పీఠాధిపతులతో పాటు, రాష్ట్ర దేవాదాయ శాఖ రంగంలోకి దిగి సంప్రదింపులు జరిపినప్పటికీ ఇరువర్గాలు మెట్టు దిగడం లేదు. స్థానిక పెద్దలతోపాటు కొందరు మండల స్థాయి నాయకులు శివైక్యం చెందిన వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి కుటుంబసభ్యుల మధ్య చర్చలు జరిపి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు.

బ్రహ్మంగారి మఠం 12వ పీఠాధిపతిగా దివంగత పీఠాధిపతి పెద్ద భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రిస్వామిని ఎంపిక చేశారు. ఉత్తరాధికారిగా రెండవ కుమారుడు వీరభద్ర స్వామిని ఎంపిక చేశారు. భవిష్యత్ వారసులుగా రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మ కుమారుల్లో ఒకరిని పీఠాధిపతిగా నియమించాలని నిర్ణయించారు.

పీఠాధిపతి నియామకంపై మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి జోక్యం చేసుకున్నారు. శుక్రవారం ఉదయం నుంచి ఇరు కుటుంబాలతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అందరూ ఒక అంగీకారానికి వచ్చారని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రకటించారు. కందిమల్లయ్యపల్లి సంస్థానంపుర ప్రజల సహకారంతో పీఠాధిపతి ఎంపిక జరిగింది. ఈ నిర్ణయాన్ని శనివారం కుటుంబసభ్యుల సమక్షంలో పెద్దలు ప్రకటిస్తారు. త్వరలో పీఠాధిపతి పట్టాభిషేక మహోత్సవం జరగనుందని తెలిపారు. మరోసారి పెద్ద భార్య కుటుంబ సభ్యులు, రెండో భార్య మారుతి మహాలక్ష్మి తో కూర్చొని మాట్లాడుకుని సాయంత్రం 4 గంటలకు పీఠాధిపతి ఎవరనేది కుటుంబ సభ్యులు అంతా కలిసి అధికారికంగా ప్రకటిస్తారని ఆయన పేర్కొన్నారు. పీఠాధిపతి పట్టాభిషేకం మఠంలోని ఆస్థాన పురోహితుల నిర్ణయ తేదీ ప్రకారం ప్రకటిస్తామన్నారు.

ఇదిలావుంటే, బ్రహ్మం గారి మఠం పీఠాధిపతి వివాదం కొలిక్కి వచ్చిందని వస్తున్న వార్తలు అవాస్తవమని వెంకటేశ్వర స్వామి రెండవ భార్య మారుతి మహాలక్ష్మి అన్నారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తనతో ఇంతవరకూ చర్చించ లేదని మారుతి మహాలక్ష్మమ్మ వెల్లడించారు. ఇవాళ బ్రహ్మంగారి మఠంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పెద్ద భార్య కుమారులైన వెంకటాద్రి వీరభద్రయ్యలు మాత్రమే ఎమ్మెల్యేతో సమావేశమయ్యారని ఆమె తెలిపారు. సాయంత్రం తనతో చర్చిస్తామని ఎమ్మెల్యే తెలిపారన్నారు. కర్నాటకకు చెందిన గాలి కరుణాకర్ రెడ్డి అభిప్రాయం మేరకు తమ అంగీకారం తెలియజేస్తామన్నారు. తనకు న్యాయం జరిగితే ఏకాభిప్రాయానికి వస్తానన్నారు. తన నిర్ణయాన్ని సాయంత్రం ఎమ్మెల్యేతో చర్చించిన తర్వాత ప్రకటిస్తానని మహాలక్ష్మమ్మ వెల్లడించారు. మా కొడుకు గోవింద స్వామి తదుపరి పీఠాధిపతి కావాలనే మా ఉద్దేశ్యం.. స్వామి వారి చివరి కోరిక కూడా అదే అని మహాలక్ష్మమ్మ స్పష్టం చేశారు.

Read Also…  Pregnant Woman Suicide: పెళ్లై మూడేళ్లకే గ్రామ వాలంటీర్ ఆత్మహత్య.. చేతిలో ఓ బిడ్డ, కడపుల మరో బిడ్డతో బావిలో దూకి మృతి