Pregnant Woman Suicide: పెళ్లై మూడేళ్లకే గ్రామ వాలంటీర్ ఆత్మహత్య.. చేతిలో ఓ బిడ్డ, కడపుల మరో బిడ్డతో బావిలో దూకి మృతి

శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ నిండు గర్భిణి.. రెండేళ్ల బిడ్డ తన బిడ్డతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.

Pregnant Woman Suicide: పెళ్లై మూడేళ్లకే గ్రామ వాలంటీర్ ఆత్మహత్య.. చేతిలో ఓ బిడ్డ, కడపుల మరో బిడ్డతో బావిలో దూకి మృతి
Pregnant Woman Commits Suicide With Two Years Baby Girl
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 26, 2021 | 10:32 AM

Pregnant Woman Suicide with Two Years Baby: శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ నిండు గర్భిణి.. రెండేళ్ల బిడ్డ తన బిడ్డతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయ విదారక ఘటన శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం చిన మురపాక గ్రామ సమీపంలో జరిగింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చిన్నతనంలోనే అమ్మను పోగొట్టుకున్న ఆ యువతికి తండ్రి, మేనమామలు ఏ లోటూ లేకుండా గారాభంగా పెంచి పెద్ద చేశారు. ఓ వ్యక్తికిచ్చి ఘనంగా పెళ్లి చేశారు. ఏడాది తిరగ్గానే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి తల్లిగా మారింది. ఇక, ఆమె జీవితమంతా ఆనందమే అనుకుని బంధువులు మురిసిపోయారు. అయితే, ఊహించని రీతిలో ఆమె కాపురంలో కలతలు మొదలయ్యాయి. నిత్యం నరకం అనుభవిస్తూ బాధనంతా పంటి బిగువున భరిస్తూ వచ్చింది. చివరికి విసిగిపోయి ఆ నరకం కంటే మరణమే శరణ్యమనుకుంది. తాను నిండు గర్భిణి అని కూడా ఆలోచించలేదు.. రెండేళ్ల బిడ్డ అనాథ కాకూడదనుకుంది. తన బిడ్డతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.

లావేరు మండలం కేశవరాయునిపాలెం గ్రామానికి చెందిన బోనెల రాజేశ్వరి(28)కి అదే గ్రామానికి చెందిన కోటేశ్వరరావుతో మూడేళ్ల కిందట వివాహమైంది. వీరికి రెండేళ్ల పాప భువనేశ్వరి ఉంది. రాజేశ్వరి స్థానికంగా గ్రామ వాలంటీరుగా పనిచేస్తోంది. ప్రస్తుతం ఏడునెలల గర్భిణి. భార్యాభర్తల గొడవల కారణంగా ఈనెల 23న పాపను తీసుకొని ఇంట్లోనుంచి వెళ్లిపోయింది. అప్పటినుంచి కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు. ఇదే క్రమంలో శుక్రవారం చిన్నమురపాక సమీపంలోని నేలబావిలో తల్లీ బిడ్డల మృతదేహాలు తేలడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఈ విషయం సమీప గ్రామాలకు తెలియడంతో కేశవరాయుపాలెం నుంచి కొందరు ఘటనా స్థలానికి చేరుకొని అవి రాజేశ్వరి, భువనేశ్వరి మృతదేహాలుగా గుర్తించి బంధువులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కి తరలించారు. వీరిద్దరూ ఇంటి నుంచి బయలుదేరినరోజే చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. రాజేశ్వరి తమ్ముడు గన్నియ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు లావేరు పోలీసులు తెలిపారు.

ఇదిలావుంటే, అత్తింటి వేధింపులు తాళలేకే రాజేశ్వరి బిడ్డతో సహా ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అదనపు కట్నం తీసుకురావాలని అత్తమామలు వేధించేవారని, భర్త కోటేశ్వరరావు నిత్యం మద్యం తాగి వచ్చి కొట్టేవాడని రాజేశ్వరి తమ్ముడు గన్నియ్య, తండ్రి సూర్యనారాయణ చెబుతున్నారు. ఇంట్లో నరకం చూపిస్తున్నారంటూ రాజేశ్వరి తరుచూ తమకు చెప్పుకుని బాధపడేదని వాపోయారు. తన సోదరి వెళ్లిపోయినప్పటి నుంచి లావేరు పోలీసుస్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా పట్టించుకోలేదని గన్నియ్య ఆరోపిస్తున్నారు. రాజేశ్వరికి సీమంతం చేసి తమ ఇంటికి తీసుకువెళ్లేందుకు పుట్టింటివారు ఈనెల 30న ముహూర్తం నిర్ణయించారు. ఇంతలోనే దారుణం జరగడంతో వారు జీర్ణించుకోలేకపోతున్నారు. గ్రామంలో అందరితో సరదాగా ఉండే రాజేశ్వరి ఆత్మహత్య చేసుకోవడంతో రెండు గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.

Read Also…..  గర్భాశయం లేదు..అయినా ఆరోగ్య వంతమైన బిడ్డకు జన్మనిచ్చింది..!అమెరికాలో అరుదైన శస్త్ర చికిత్స:Woman born without Uterus.

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..