తెలుగు చిత్రపరిశ్రమలో కార్మికులు బుధవారం నుంచి సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. తమకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సభ్యులు సమ్మెకు పిలుపునిచ్చారు.. ఈ క్రమంలోనే ఫిలిం ఛాంబర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.. సినీ కార్మికులు చేపట్టిన సమ్మెపై సీనియర్ నటుడు నరేష్ స్పందించారు.. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేశారు.. కరోనా సంక్షోభం కారణంగా చిత్రపరిశ్రమ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందని.. ఇప్పుడిప్పుడే కాస్త మెరుగుపడుతుందని.. ఇలాంటి సమయంలో సమ్మెబాట పట్టడం సరైన పద్దతి కాదన్నారు.. తొందరపాటుతో కాకుండా..కార్మికులు, నిర్మాతలు కలిసి ఒక నిర్ణయం తీసుకుని పరిష్కరించుకోవాలని.. కృష్ణనగర్‌కు… ఫిలిం నగర్‌కు కేవలం 3 కిలోమీటర్ల దూరమే.. అందరం కలిసి నిర్ణయం తీసుకుని సినీ పరిశ్రమ మరోసారి అంధకారంలోకి వెళ్లకుండా చూస్తే బాగుంటుందని అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు..
నరేష్ మాట్లాడుతూ. ” నిన్నటి నుంచి ఎక్కడ చూసినా సినిమా షూటింగ్స్ ఆగిపోతున్నాయనే వార్తలు కనిపిస్తున్నాయి. వేతనాలు పెంచకపోవడం వలన షూటింగ్స్ బంద్ చేస్తామంటూ కార్మికులు సమ్మె బాట పట్టారని తెలిసింది.. అందరికి మంచి జరిగేలా పెద్దలందరూ కలిసి ఓ నిర్ణయం తీసుకుంటారు.. గత మూడేళ్లుగా కరోనా సంక్షోభంతో ప్రపంచంతోపాటు సినీ పరిశ్రమకు కూడా దెబ్బతింది.. కార్మికులు, చిన్న ఆర్టిస్టులు తినడానికి తిండి లేక నానా ఇబ్బందులు పడ్డారు.. వైద్యం చేయించుకోవడానికి డబ్బుల్లేక చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.. ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమ ప్రాణం పోసుకుంటుంది.. మనందరి కంచాలు నిండుతున్నాయి.. తెలుగు చిత్రపరిశ్రమకు మంచి పేరు వస్తుంది. నిర్మాతలు కూడా కరోనా సమయంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నారు.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.. ఈ సమయంలో తొందరపాటుతో కాకుండా ఒక వారం లేదా పదిరోజుల సమంయ తీసుకుని ఫెడరేషన్, నిర్మాతలు కలిసి ఒక నిర్ణయానికి రావడం కష్టం కాదు.. కృష్ణనగర్, ఫిలిం నగర్ కు ఉన్న దూరం కేవలం 3 కిలోమీటర్లు మాత్రమే. అందరం కలిస్తేనే కుటుంబం..పెద్దలందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటాం.. మరోసారి ఇండస్ట్రీకి అంధకారంలోకి వెళ్లకుండా నిర్ణయానికి వస్తే బాగుంటుందనుకుంటున్నాను .. ఇండస్ట్రీ బిడ్డగా ఏం చేయడానికైనా సిద్ధమే ” అంటూ చెప్పుకొచ్చారు.
ట్వీట్..
But we should remember that the majority of the TFI mainly the families of small technicians & actors went without food & medication & the producers suffered severe financial setbacks & just recuperating. Almost 20 units are in outdoor locations.
(2/3) pic.twitter.com/VzgQzE3ewF— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) June 22, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.