Thimmarusu: వరుస సినిమాలను లైన్‌‌‌‌‌లోపెడుతోన్న వెర్సటైల్ యాక్టర్.. త్వరలో ప్రేక్షకుల ముందుకు తిమ్మరుసు..

|

Jul 24, 2021 | 8:56 PM

టాలెంటెడ్ హీరో సత్య దేవ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మారో వైపు వెబ్ సిరీస్ లను కూడా చేస్తున్నాడు.

Thimmarusu: వరుస సినిమాలను లైన్‌‌‌‌‌లోపెడుతోన్న వెర్సటైల్ యాక్టర్.. త్వరలో ప్రేక్షకుల ముందుకు తిమ్మరుసు..
Follow us on

Thimmarusu : టాలెంటెడ్ హీరో సత్య దేవ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌‌‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మారో వైపు వెబ్‌‌‌సిరీస్‌‌‌‌లను కూడా చేస్తోన్నాడు. అంతే కాదు తమిళ్ హీరోలకు డబ్బింగ్ కూడా చెప్తున్నాడు ఈ వెర్సటైల్ యాక్టర్. అంతటితో ఆగకుండా బాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తోన్నాడు. త్వరలో అక్షయ్ కుమార్ నటిస్తోన్న రామ్‌‌‌‌‌సేతు సినిమాలో చేస్తోన్నాడు సత్య దేవ్. ఇక సత్యదేవ్ తెలుగు సినిమాల విషయానికొస్తే..  ప్రస్తుతం తిమ్మరుసు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. తిమ్మరుసు సినిమాలోను విలక్షణమైన పాత్రను పోషించాడు సత్యదేవ్. ఈ సినిమాతో శరణ్ కొప్పిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ‘తిమ్మరుసు’ చిత్రం జూలై 30న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో సెన్సర్ పూర్తి చేసుకుంది ఈ సినిమా. సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి యు/ఎ సర్టిఫికేట్ ను ఇచ్చారు.

ఇక ఈ మూవీలో సత్యదేవ్ సరసన నాయికగా ప్రియాంక జవాల్కర్ నటించింది. ‘టాక్సీవాలా’ సినిమాతో పరిచయమైన ఈ బ్యూటీ, సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తోంది. ఈ సినిమా పైనే ఈ అమ్మడు ఆశలు పెట్టుకుంది. ఇక ‘బ్లఫ్ మాస్టర్’ ఫేమ్ గోపిగణేశ్ పట్టాభి దర్శకత్వంలో ‘గాడ్సే’ అనే మరో వైవిధ్యమైన సినిమా చేస్తోన్నాడు. అలానే స్టార్ హీరోయిన్ తమన్నా భాటియాతో కలసి ‘గుర్తుందా శీతాకాలం’ అనే సినిమాలో నటిస్తోన్నాడు సత్యదేవ్. ఇదే క్రమంలో వీవీ గోపాలకృష్ణ అనే కొత్త దర్శకుడితో ‘భగవద్గీత సాక్షిగా’ చిత్రాన్ని అనౌన్స్ కూడా అనౌన్స్ చేశాడు సత్యదేవ్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nandamuri Balakrishna: జోరుపెంచిన నటసింహం.. డైనమిక్ డైరెక్టర్‌‌‌తో మరో సినిమా ప్లాన్..

Ishq: శ్రోతల హృదయాలను తాకుతున్న అందమైన ప్రేమ పాట.. ఇష్క్ నుంచి వీడియో సాంగ్..