Satyadev’s 25th Movie: జోరు పెంచిన టాలెంటెడ్ హీరో.. 25వ సినిమా మొదలు పెట్టిన సత్యదేవ్..

‘బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వరాయ ఉగ్రరూస్య’ చిత్రాల‌తో పాటు రీసెంట్‌గా ‘తిమ్మ‌రుసు’తో సూపర్ హిట్స్ సాధించాడు హీరో సత్యదేవ్. తాజాగా ఈ టాలెంటెడ్ హీరో  25వ చిత్రం బుధ‌వారం లాంచ‌నంగా

Satyadev's 25th Movie: జోరు పెంచిన టాలెంటెడ్ హీరో.. 25వ సినిమా మొదలు పెట్టిన సత్యదేవ్..
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 18, 2021 | 8:02 PM

Satyadev’s 25th Movie: ‘బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వరాయ ఉగ్రరూస్య’ చిత్రాల‌తో పాటు రీసెంట్‌గా ‘తిమ్మ‌రుసు’తో సూపర్ హిట్స్ సాధించాడు హీరో సత్యదేవ్. తాజాగా ఈ టాలెంటెడ్ హీరో  25వ చిత్రం బుధ‌వారం లాంచ‌నంగా ప్రారంభ‌మైంది. స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ఈ చిత్రానికిసమర్పిస్తున్నారు. అరుణాచ‌ల క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్‌.నెం.2గా కృష్ణ కొమ్మ‌ల‌పాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వి.వి.గోపాల కృష్ణ ద‌ర్శ‌క‌త్వం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గురువారం హైద‌రాబాద్‌లో ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి.

ముహూర్త‌పు స‌న్నివేశానికి స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజుగారు క్లాప్‌కొట్ట‌గా, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ కెమెరా స్విచ్ ఆన్ చేసి, గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. నిర్మాత దిల్‌రాజు, డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌, ప్ర‌ముఖ ఫైనాన్సియ‌ర్ ఎంఆర్‌విఎస్‌.ప్ర‌సాద్ స్క్రిప్ట్‌ను ద‌ర్శ‌కుడు వి.వి.గోపాల‌కృష్ణ‌కు అందించారు. ఇది వ‌ర‌కే విడుద‌లైన ఈ సినిమా కాన్సెప్ట్ పోస్ట‌ర్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. మ‌రో స‌రికొత్త పాత్ర‌లో స‌త్య‌దేవ్ మెప్పించ‌నున్నార‌ని కాన్సెప్ట్ పోస్ట‌ర్‌తో అర్థ‌మైంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమాకు స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించ‌ని స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తొలిసారి ఈ సినిమాకు స‌మ‌ర్ప‌కుడిగా ఉండ‌టం సినిమాపై మ‌రింత ఆస‌క్తిని క్రియేట్ చేస్తోంది. కాల భైర‌వ సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి స‌న్నీ కూర‌పాటి సినిమాటోగ్ర‌ఫీ, న‌వీన్ నూలి ఎడిట‌ర్‌గా బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో హీరోయిన్ స‌హా ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల విష‌యాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Tuck Jagadish : ఓటీటీకే ఓటేసేలా ఉన్నారా..? నాని ఎమోషనల్ పోస్ట్ మీనింగ్ అదేనా.. టక్ జగదీష్‌‌‌‌కు తిప్పలు తప్పవా..?

JR NTR: ఎన్టీఆర్‌ గ్యారెజ్‌లోకి లాంబొర్గిని ఉరుస్​ గ్రాఫైట్​ క్యాప్సూల్​ మోడల్​.. దేశంలోనే మొదటిది.. కాస్ట్..?

MAA Elections 2021: ప్రకాష్ రాజ్ కోసం షాకింగ్ నిర్ణయం తీసుకున్న అభిమాని.. ఏకంగా ఐదు రోజుల పాటు..!! పెద్ద సాహసమనే చెప్పాలి..