MAA Elections 2021: ప్రకాష్ రాజ్ కోసం షాకింగ్ నిర్ణయం తీసుకున్న అభిమాని.. ఏకంగా ఐదు రోజుల పాటు..!! పెద్ద సాహసమనే చెప్పాలి..
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్ (మా) ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక ప్రకాష్ రాజ్ ఎన్నికల్లో పోటీచేయడంతో
MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్ (మా) ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక ప్రకాష్ రాజ్ ఎన్నికల్లో పోటీచేయడంతో ఈ హీట్ మరింత పెరిగింది. ఒక అడుగు ముందుకేసి తన ప్యానల్‌ను కూడా ప్రకటించారు ప్రకాష్ రాజ్. ఆ వెంటనే నేను పోటీకి సై అంటూ మంచు విష్ణు రంగంలోకి దిగారు. ఇదిలా ఉంటే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల్లో నటుడు ప్రకాష్ రాజ్ విజయం సాధించాలని రాజమండ్రి నుంచి హైదరాబాద్ వరకు ఆయన అభిమాని పాదయాత్ర చేపట్టాడు. రాజమండ్రి రూరల్ కొలమూరు నుంచి హైదరాబాద్ వరకు ఐదు రోజుల పాటు 485 కిలోమీటర్లు ఈ పాదయాత్ర సాగనుంది. ప్రకాష్ రాజ్ అంటే అభిమానంతో ఆయన మా అధ్యక్షుడిగా విజయం సాధించాలని పాదయాత్ర చేపట్టినట్టు జూనియర్ అర్టిస్ట్ రంజిత్ కుమార్ తెలిపాడు.
ఇక మా లో చాలా సమస్యలు ఉన్నాయని.. వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తానని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. అలాగే మా కు సొంత బిల్డింగ్ ఏర్పాటు గురించి కూడా చర్చ జరుగుతోంది. ఈ సారి ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ – మంచు విష్ణుతో పాటు హేమ- జీవిత- సీవీఎల్ వంటి వారు రేసులో ఉన్నారు. అలాగే హేమ ఇటీవల చేసిన ఆరోపణలు మాలో కలకలాన్ని రేపాయి. మా నిధులు దుర్వినియోగం చేశారంటూ హేమ సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై క్రమశిక్షణ హేమ కు వార్నింగ్ ఇచ్చి వదిలేసింది. మరో వైపు ఈ నెల 22న మా జనరల్ బాడీ మీటింగ్‌లో మా ఎలక్షన్స్ తేదీ ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది.
మరిన్ని ఇక్కడ చదవండి