Prabhas’s Adipurush: ఆదిపురుష్ సెట్‌‌‌లో అడుగు పెట్టిన ప్రభాస్.. ఫుల్ జోష్‌‌‌లో చిత్రయూనిట్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలకోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వరుసగా భారీ సినిమాలను అనౌన్స్ చేసిన డార్లింగ్.. చకచకా వాటిని పూర్తి

Prabhas's Adipurush: ఆదిపురుష్ సెట్‌‌‌లో అడుగు పెట్టిన ప్రభాస్.. ఫుల్ జోష్‌‌‌లో చిత్రయూనిట్..
Prabhas
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 18, 2021 | 8:36 PM

Prabhas’s Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలకోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వరుసగా భారీ సినిమాలను అనౌన్స్ చేసిన డార్లింగ్.. చకచకా వాటిని పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఇప్పటికే రాధాకృష్ణ దర్శకత్వం చేస్తున్న రాధేశ్యామ్ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేశాడు ప్రభాస్. అలాగే  ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో చేస్తున్న సలార్ మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో మాఫియా డాన్‌గా కనిపించనున్నాడు ప్రభాస్. అలాగే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ కూడా ప్రభాస్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రామాయణ నేపథ్యంలో ఉండనుందని మొదటినుంచి టాక్. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. అలాగే రావణుడిగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఇక సీతగా కృతిసనన్ చేస్తుంది. ఈ సినిమా షూటింగ్‌ను ఇటీవలే మొదలు పెట్టారు. ఇక ‘ఆది పురుష్’ షూటింగు కోసం రీసెంట్‌గా ముంబై వెళ్లి, ఈ సినిమా షూటింగులో జాయిన్ అయ్యాడు.

ఈ సినిమా షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆలస్యం అయ్యింది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదలకు ఈ ఏడాదిలోనే పూర్తి చేసి గ్రాఫిక్స్ వర్క్ కోసం టైమ్ కేటాయించబోతున్నారు. ఇప్పుడు ప్రభాస్ కూడా షూటింగ్ లో జాయిన్ అవ్వడంతో చిత్రయూనిట్ వేగంగా షూటింగ్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ .. కృతి సనన్ కాంబినేషన్లో విజువల్ ఎఫెక్ట్స్‌తో కూడిన సన్నివేశాలను గ్రీన్ మ్యాట్‌లో చిత్రీకరిస్తున్నారట. ఆదిపురుష్ సినిమా షూటింగ్ కోసం ఈ నెల చివరి వరకు ప్రభాస్ అక్కడే ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది దసరా బరిలో ఈ సినిమా ఉండొచ్చని చెప్పుకుంటున్నారు. మరో వైపు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్ట్ కె సినిమాను 2023 లో విడుదల చేయబోతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Short Film Competitions: ‘నవరత్నాలు’, మహిళాభివృద్ధి, సంక్షేమ పథకాలపై షార్ట్‌ఫిల్మ్‌ పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం

Bandla Ganesh: ఆ విషయంలో బండ్ల గణేష్ కీలక నిర్ణయం.. ఇక దబిడిదిబిడే అంటూ కామెంట్లు పెడుతున్న అభిమానులు..

Krish -Vaishnav Tej : ఎట్టకేలకు క్రిష్-వైష్ణవ్ తేజ్ మూవీ అప్ డేట్ రానుంది.. ఎప్పుడంటే..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే