Vedantam Raghavaiah: మారిన “వేదాంతం రాఘవయ్య” హీరో.. సునీల్ ప్లేస్‌లోకి ఆ యంగ్ హీరో..

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తున్నారు. భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్‌తో ఈ సినిమా రాబోతుంది.

Vedantam Raghavaiah: మారిన వేదాంతం రాఘవయ్య హీరో.. సునీల్ ప్లేస్‌లోకి ఆ యంగ్ హీరో..
Sunil

Updated on: Nov 19, 2021 | 1:41 PM

Harish Shankar: టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తున్నారు. భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్‌తో ఈ సినిమా రాబోతుంది. ప్రస్తుతం పవన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. పవన్ కమిట్ అయిన సినిమాలను కంప్లీట్ చేసిన తర్వాత హరీష్ శంకర్ సినిమా ఉంటుంది. అయితే ఈ గ్యాప్ లో హరీష్ శంకర్ ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే దర్శకుడిగా కాదు వేదాంతం రాఘవయ్య సినిమాకు హరీష్ కథను అందిస్తున్నారు. 14 ప్లస్ రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట- గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సి. చంద్రమోహన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ముందుగా ఈ సినిమాలో కమెడియన్ కమ్ హీరో సునీల్ ను అనుకున్నారు. అయితే ఇప్పుడు సునీల్ ప్లేస్‌లో మరో హీరోను తీసుకున్నారని తెలుస్తుంది.

ఒకప్పుడు కమెడియన్‌గా రాణించిన సునీల్ ఆ తర్వాత హీరోగా మారి సినిమాలు చేశారు. ఇక ఇప్పుడు తిరిగి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా నటించి మెప్పిస్తున్నారు. అయితే అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ నుంచి సునీల్ తప్పుకున్నారని తెలుస్తుంది. సునీల్ ప్లేస్ లో హీరో సత్య దేవ్ ను తీసుకున్నారట. విలక్షణ పాత్రలతో వైవిధ్యమైన కథలతో సినిమాలు చేసే సత్యదేవ్.. ఇందులో టైటిల్ రోల్ పోషించనుండడం ఆసక్తిగా మారింది. అయితే సునీల్ ఈ సినిమానుంచి ఎందుకు తప్పుకున్నారో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు పెట్టనున్నారు. హరీష్ శంకర్ ఈ సినిమాకోసం ఓ అద్భుతమైన కథను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sharwanand : ఓటీటీ బాటలో కుర్ర హీరో సినిమా.. శర్వానంద్ ఆశలన్నీ ఆ మూవీ పైనే మరి..

Naga Chaitanya: వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా అక్కినేని యంగ్ హీరో.. చైతన్య చేతిలో ఎన్ని సినిమాలున్నాయో తెలుసా..

Victory Venkatesh: న్యూ లుక్ తో అదరగొడుతున్న వెంకీ మామ.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫొటోస్..