కెప్టెన్‌గా సంజన.. డ్యూటీ ఎక్కగానే హౌస్‌మేట్స్‌కు చుక్కలు చూపిస్తుందిగా

బిగ్ బాస్ సీజన్ 9 రసవత్తరంగా సాగుతుంది. సామాన్యులు, సెలబ్రెటీలు కలిసి ఆడుతున్న ఈ సీజన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే సీజన్ మొదలై 5 రోజులవుతుంది. హౌస్ లోకి వెళ్లిన కంటెస్టెంట్స్ అందరూ తమ ఆటను మొదలు పెట్టేశారు. మొదటి వారం ఎవరుఎలిమినేట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

కెప్టెన్‌గా సంజన.. డ్యూటీ ఎక్కగానే హౌస్‌మేట్స్‌కు చుక్కలు చూపిస్తుందిగా
Bigg Boss9

Updated on: Sep 13, 2025 | 7:49 AM

బిగ్ బాస్ సీజన్ 9లో ఐదో రోజు కూడా రచ్చ గట్టిగానే జరిగింది. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నది శ్రష్ఠి వర్మ, ఫ్లోరా షైనీ, రీతూ చౌదరి, సంజనా గల్రానీ, తనూజా గౌడ, సుమన్ శెట్టి, రాము రాథోడ్, డీమన్ పవన్, ఇమ్మానుయేల్. వీరిలో ఒకరు హౌస్ నుంచి మొదటి వారం బయటకు వెళ్లనున్నారు బిగ్‌బాస్ సీజన్-9 ఫస్ట్ కెప్టెన్‌గా సంజన నిలిచింది. అఫీషియల్‌గా హౌస్‌కి తొలి కెప్టెన్ అయిపోయింది. నిజం చెప్పాలంటే హౌస్ లో ఉన్న సెలబ్రెటీలు, సామాన్యులు మొత్తం సంజనకు రివర్స్ అయ్యారు. కానీ ఓనర్స్, టెనెంట్స్ ఇద్దరూ కొట్టుకొని చివరకు సంజనను కెప్టెన్ చేశారు. అందరూ సంజన కెప్టెన్ అవ్వకూడదు అని కోరుకున్నారు. కానీ సీజన్ 9లో తొలి కెప్టెన్ గా సంజన నిలిచింది.

ఇక కెప్టెన్ అయిన సంజన డ్యూటీ మొదలు పెట్టింది. ఫ్లోరా ను వెళ్లి లగేజ్ తీసుకురా అని ఆర్డర్ వేసింది. కానీ ఫ్లోరా తీసుకురాను అని ముఖం మీదే ఫ్లోరా చెప్పేసింది. దాంతో సంజన కెప్టెన్ చెప్పింది వినాలి వినకపోతే పర్యవసానాలు నువ్వు ఫేస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పింది సంజన. ఆతర్వాత హౌస్ మొత్తం స్కిట్ చేయాలి, నాకు వంట చేసి పెట్టండి అని ఆర్డర్ వేసింది సంజన. దాంతో కామనర్లు సంజనకి వచ్చిన లగ్జరీ ఐటెమ్స్‌ని లేపేశారు.

సంజన కెప్టెన్ అవ్వడంతో బిగ్‌బాస్ అభినందనలు తెలిపాడు. సంజన కెప్టెన్ అవ్వడంతో ఒక వారం రోజులు టెంపరరీ ఓనర్ గా ప్రమోట్ చేశాడు బిగ్ బాస్. కెప్టెన్ అయినా సంజన ఐటమ్స్ ను కామనర్స్ లేపేశారు. కెప్టెన్ కోసం బిగ్‌బాస్ పంపించిన లగ్జరీ ఐటెమ్స్ నుంచి చాక్లెట్లు, చిప్స్ ప్యాకెట్లు కొట్టేశారు కామనర్లు ప్రియ, శ్రీజ. నన్ను ఇంప్రెస్ చేసిన వాళ్లకి థంమ్స్ అప్ ఇస్తా అంటూ సంజన ఆఫర్ ఇచ్చింది. ఒక థంమ్స్ అప్ కొట్టుకొని బయటికొచ్చేశాడు హరీష్. హౌస్‌లో అందరూ కలిసి ఒక స్కిట్ చేయండి నవ్వుకోవాలి అంటూ సంజన అంది. ఆ స్కిట్ లో తనను మెప్పించిన వారికి ఒక్కొక్కరికీ ఒక్కో థంమ్స్ అప్ ఇస్తున్నట్లు సంజన అనౌన్స్ చేసింది. స్కిట్ అయిన తర్వాత నా దగ్గర కొట్టేసిన  థంమ్స్ అప్ ఇచ్చేయండి. ఎవరు తీశారో చెప్తే అప్పుడు ఇవి ఇస్తాను అంటూ ట్విస్ట్ ఇచ్చింది. దాంతో అందరూ షాక్ అయ్యారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి