మేజర్ (Major) సినిమా మా దుఃఖాన్ని మరిచేలా చేసింది.. సందీప్ జీవితాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించారన్నారు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తండ్రి కె. ఉన్నికృష్ణన్. 26/11 ముంబై టెర్రరిస్ట్ దాడులలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు పోరాటం చేసి వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం మేజర్. డైరెక్టర్ శశికిరణ్ తిక్క, టాలెంటెడ్ హీరో అడివి శేష్ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఈరోజు (జూన్ 3న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మేజర్ సందీప్ పాత్రలో అడివి శేష్ నటించగా.. అతని తల్లిదండ్రులుగా ప్రకాష్ రాజ్, రేవతి నటించారు.. ఇందులో బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ కథానాయికగా కనిపించింది. ఈరోజు విడుదలైన మేజర్ సినిమాను చూసి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు సందీప్ తల్లిదండ్రులు.
సందీప్ జీవితాన్ని చాలా మంచి సినిమాగా తెరకెక్కించినందుకు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సినిమాలో నటీనటుల నటన, సినిమాటోగ్రఫీ, కెమెరా వర్క్ బాగుందని…ఈ మూవీ తమ దుఃఖాన్ని మరిచేలా చేసిందన్నారు. అందరూ సందీప్ వెళ్లిపోయాడు.. చనిపోయాడను అనుకుంటున్నారని.. కానీ తన తుదిశ్వాస వరకు ప్రజల ప్రాణాల్ని కాపాడే ప్రయత్నం చేశాడు.. ఎంతోమందికి స్పూర్తిగా నిలిచాడు.. నేను సందీప్‌తో హైదరాబాద్‌లో ఉన్నాను.. నా కెరీర్ ఇక్కడే ప్రారంభించాను.. నా కుమారుడితో ఇక్కడ చాలా మంచి సమయం గడిపాను.. ఇప్పుడు మై బాయ్స్ (చిత్రయూనిట్)తో మంచి సమయం గడుపుతున్నాను.. హైదరాబాద్ లో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను.. సమయం ఉన్నప్పుడు మళ్లీ మళ్లీ హైదరాబాద్ వస్తాను.. అంటూ ఎమోషనల్ అయ్యారు సందీప్ ఉన్నికృష్ణన్ తండ్రి కె. ఉన్నికృష్ణన్.
మేజర్ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా బ్యానర్లు సంయుక్తంగా నిర్మించగా.. ఈ సినిమా జూన్ 3న తెలుగుతోపాటు హిందీ, మలయాళం భాషలలో విడుదలైంది.
‘Sandeep has fought till his last breath & beyond. He continues to motivate all of us’
Mr. Unnikrishnan at the special premieres in Hyderabad.#MajorTheFilm ??@AdiviSesh @saieemmanjrekar #SobhitaD @SashiTikka @urstrulyMahesh @SonyPicsIndia @AplusSMovies pic.twitter.com/kp9qsi93ei— GMB Entertainment – MajorTheFilm In CINEMAS NOW (@GMBents) June 3, 2022