హీరో సందీప్ కిషన్ మునుపెన్నడూ చూడని యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘’మైఖేల్’. సందీప్ కిషన్ తొలి పాన్ ఇండియా చిత్రమైన ’మైఖేల్’కి రంజిత్ జయకోడి దర్శకత్వం వహించారు. ఇందులో విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్, దివ్యాంశ కౌశిక్, వరుణ్ సందేశ్, గౌతమ్ మీనన్, కీలక పాత్రలలో నటించగా.. కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి, మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి కలిసి ఈ చిత్రాన్ని భారీ నిర్మించాయి. ఫిబ్రవరి3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ అనుకున్నంతగా సక్సెస్ అయితే కాలేదు అంతేకాదు.. సాధారణంగా ఏ సినిమా అయిన విడుదలైన నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వస్తుంది.. కానీ మైఖేల్ చిత్రం ఇదే నెలలో డిజిటల్ ప్లాట్ ఫాంపై సందడి చేయబోతుంది.
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ మాధ్యామం ఆహా సొంతం చేసుకుంది. ఫిబ్రవర 24న ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది ఆహా. రెడీగా ఉండండి.. పిచ్చెక్కించే యాక్షన్ తో రాబోతున్నాడు మన మైఖేల్. నాన్ స్టాప్ యాక్షన్ ఎంటర్టైనర్ అని అహా ట్వీట్ చేసింది.
భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి నారాయణ్ దాస్ కె నారంగ్ సమర్పకులు. ఈ సినిమాకు సామ్ సి ఎస్ సంగీతం అందించారు. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్ అయిన వారు ఇంట్లోనే చూడొచ్చు.