Samuthirakani : ఇటీవల తమిళ్ నటుడు సముద్రఖనికి తెలుగులో వరుస ఆఫర్లు వస్తున్నాయి. తన నటనతో విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు సముద్రఖని. ఆయన నటించిన అల వైకుంఠపురంలో సినిమా..ఇటీవల విడుదలైన రవితేజ క్రాక్ సినిమాలు సముద్రఖని మంచి పేరు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా క్రాక్ సినిమాలో కటారి కృష్ణ గా విలనిజం చూపించి ఆకట్టుకున్నాడు సముద్రఖని. ప్రస్తుతం సముద్ర ఖని చేతిలో భారీ సినిమాలే ఉన్నాయి. వాటిలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్ సినిమా ఒకటి. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో సముద్రఖని విలన్ గా నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు విలన్ గా ఆయనే దాదాపు ఖరారైనట్టే అని తెలుస్తుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి చిత్రంలోనూ సముద్రఖని నటించనున్నట్లు సమాచారం.మెగాస్టార్ లూసిఫర్ రీమేక్ లో కీలక పాత్రలో సముద్రఖని నటిస్తున్నారని తెలుస్తుంది. ‘ఆచార్య’ను పూర్తి చేసే పనిలో ఉన్న చిరు.. దీని తర్వాత ‘లూసిఫర్’ రీమేక్ను మొదలు పెట్టనున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే మెగా హీరో అల్లుఅర్జున్ అల వైకుంఠపురంలో మెప్పించిన సముద్రఖని..ఇప్పుడు మెగాస్టార్ సినిమాలో నటిస్తున్నారు. తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సముద్రఖని విలన్ గా నటించనున్నారని అంటున్నారు. లూసిఫర్ ఒరిజినల్లో వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్ర చేశాడు. అయితే ఆపాత్ర చాలా స్టైలిష్ గా ఉంటుంది. మరి ఇప్పుడు సముద్రఖని అలాంటి పాత్రలో ఎలా ఉంటారా అన్న ఆసక్తి నెలకొంది. అయితే రీమేక్ కోసం ఆయన పాత్రను మార్చే అవకాశం లేకపోలేదు అని కొందరు అంటున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :