హీరోయిన్ సమీరా రెడ్డి ఇంట్లో ఆనందం నెలకొంది. సమీరా కుటుంబానికి కొత్త మెంబర్ యాడ్ అయింది. హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించిన సమీరారెడ్డి శుక్రవారం ఓ పాపకు జన్మనిచ్చింది. ఈ సంతోషాన్ని ఆమె ఇన్‌స్టోగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ ఉదయమే మా ఇంటికి చిన్నారి దేవత వచ్చింది. నా చిట్టి తల్లి. మా కోసం ప్రేమతో ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు అంటూ కుమార్తె చేతిని పట్టుకున్న ఫోటోను షేర్ చేసింది.
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన ఈమె 2014లో అక్షయ్ వార్దే అనే బిజినెస్ మ్యాన్‌ను వివాహం చేసుకున్నారు. ఇప్పటికే వీరికి హన్స్ అనే బాబు ఉన్నాడు. సమీరాకు కుమార్తె పుట్టిందని తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆమెకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెబుతున్నారు.