సమీరా రెడ్డి(Sameera Reddy).. టాలీవుడ్ ఒకప్పుడు ఈ పేరు తెగ వినిపించింది. అందం అభినయం కలబోసిన ముద్దుగుమ్మ తెలుగులో పలు సినిమాలో నటించి మెప్పించింది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసి అలరించింది సమీరారెడ్డి. తెలుగమ్మాయే అయినప్పటికీ హిందీ సినిమాలతో ఎంట్రీ ఇచ్చింది ఈ భామ, ఇక తెలుగులో నరసింహుడు, జై చిరంజీవి, అశోక్ సినిమాల్లో నటించింది సమీరా. అలాగే తమిళ్ లో ఈ చిన్నది నటించిన సూర్య సన్నాఫ్ కిషన్ సినిమాలో నటించింది ఈ భామ. ఇక ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. మంచి ఫామ్ లో ఉన్నప్పుడే పెళ్లిపీటలెక్కి సినిమాలకు దూరం అయ్యింది సమీరారెడ్డి.
ఇదిలా ఉంటే సమీరా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రకరకాల ఫోటో షూట్స్ తో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ చిన్నది. అలాగే సమీరా రెడ్డి ఇద్దరు పిల్లల తల్లి. అయినా కూడా ఆమె అందం ఏమాత్రం తగ్గలేదు. తాజాగా తాను రెండోసారి గర్భంగా దాల్చినప్పుడు దిగిన ఆఫొటోలను షేర్ చేసింది. అయితే ఈ ఫోటోలు మాములుగా దిగలేదు. బేబీ బంప్ తో నీటి అడుగున ఫోటో షూట్ చేసింది. గర్భంలో బేబీ ఉండగా, తాను ఎంతో అందమైన బాడీని కలిగి ఉన్నానంటూ సమీరారెడ్డి పోస్ట్ పెట్టింది. మహిళలు తమ శరీరాన్ని చూసి సిగ్గు పడకూడదని తెలిపింది సమీరా. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.