టాలీవుడ్ హీరోయిన్ సమంత తన సోషల్ మీడియాలో చేసే ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరలవుతుంటుంది. ఇన్నాళ్లు మయోసైటిస్ కారణంగా విశ్రాంతి తీసుకున్న సామ్.. ఇప్పుడు తిరిగి ఇండస్ట్రీలో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తుంది. ఇటీవలే సిటాడెల్ వెబ్ సిరీస్ ద్వారా అడియన్స్ ముందుకు వచ్చింది. ఇదిలా ఉంటే.. నెట్టింట నిత్యం ఏదోక పోస్ట్ చేసే సామ్.. తాజాగా రాశిఫలాల గురించి పోస్ట్ చేసింది. సామ్ వచ్చే ఏడాదిపై భారీగానే హోప్స్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎవరో పెట్టిన రాశిఫలాల పోస్టును సామ్ తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేస్తూ అమెన్ అని పెట్టింది. ఇక అందులో చాలా విషయాలే ఉన్నాయి. దీంతో ఇప్పుడు సామ్ చేసిన ఆ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇంతకీ సామ్ షేర్ చేసిన ఆ రాశిఫలాల్లో ఏముందో ఒకసారి చూద్దాం.
‘సంవత్సరం మొత్తం బిజీగానే ఉంటారు. ప్రతీ క్రాఫ్టులో మీరు అభివృద్ధి పథంలోనే ముందుకు సాగుతారు. డబ్బులు కూడా బాగానే వస్తాయి. ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. మీకు విధేయత, ప్రేమను చూపించే పార్ట్నర్ దొరుకుతాడు. పెద్ద లక్ష్యాలతో ముందుకు ప్రయాణిస్తుంటారు. పలు మార్గాల ద్వారా మీకు అధిక ఆదాయం వస్తుంది. పెద్ధ లక్ష్యాలను చేరుకుంటారు. మానసిక, శారీరక ఆరోగ్యం కలుగుతుంది. పిల్లల్ని కనాలనే ఉద్దేశం ఉంటో సంతానం వస్తుంది లేదంటే జాగ్రత్తగా ఉండండి’ అంటూ అందులో ఉన్నాయి.
అయితే సమంత షేర్ చేసిన రాశిఫలాల్లో వృషభ, కన్య, మకర రాశి ఫలాలు ఉన్నాయి. ఇక సామ్ సినిమాల విషయానికి వస్తే.. చివరిసారిగా ఖుషి చిత్రంలో కనిపించింది. ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న సామ్.. ఇటీవలే సిటాడెల్ వెబ్ సిరీస్ ద్వారా మరోసారి సినీ ప్రియుల ముందుకు వచ్చింది.
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..
Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.