టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రాణిస్తున్న బ్యూటీస్ లోసమంత(Samantha) పేరు చెప్పకుండా ఉండలేం.. సినిమాల జోరు తగ్గించిన ఈ అమ్మడే ఇప్పుడు నెంబర్ వన్. తక్కువ సమయంలో ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న ఈ బ్యూటీ తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇక ఇప్పుడు బాలీవుడ్ మీద కూడా ఫోకస్ పెట్టింది ఈ చిన్నది. అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య తో పెళ్లి ఆతర్వాత విడిపోవడం మనకు తెలిసిందే. విడిపోయిన తర్వాత చైతూ తన సినిమాలతో బిజీగా ఉంటే సామ్ మాత్రం సోషల్ మీడియాలో మోటివేషన్ కొటేషన్స్ షేర్ చేయడం. ఫ్రెండ్స్ తో విహారయాత్రలకు వెళ్లడం లాంటివి చేసింది. ఆతర్వాత ఇప్పుడు తిరిగి సినిమాలతో బిజీ అవ్వాలని చూస్తోంది. తెలుగుతో పాటు హిందీలోనూ ప్రస్తుతం సినిమాలు చేస్తోంది సామ్. తెలుగులో ఈ అమ్మడు గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా చేస్తోంది ఈ సినిమా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిస్టారికల్ కథతో తెరకెక్కిన ఈ సినిమాలో సామ్ శకుంతల గా నటిస్తోంది.
అలాగే యశోద అనే థ్రిల్లర్ మూవీలోనూ నటిస్తోంది సామ్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల ఈ అమ్మడు విదేశాలు వెళ్ళింది. అయితే సామ్ చర్మ సమస్యతో బాధపడుతుంది ఆ ట్రీట్ మెంట్ కోసమే అమెరికా వెళ్లిందని వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ వార్తల్లో వాస్తవం లేదని సామ్ మేనేజర్ టీమ్ కొట్టిపారేసింది. ప్రస్తుతం సామ్ యాక్షన్ సన్నివేశాలాల్లో నటించడానికి ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం సామ్ యాక్షన్ సీన్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకునేందుకు సామ్ అమెరికా వెళ్లిందని తెలుస్తోంది. బాలీవుడ్ లో హీరో వరుణ్ ధావన్ తో సిటాడెల్ రీమేక్ లో నటిస్తోంది సామ్. ఈ సినిమా కోసమే ఆమె అమెరికా వెళ్లిందని టాక్. ఫ్యామిలీ మెన్ మేకర్స్ రాజ్ డీకే డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ భారీ బడ్జెట్ తో రస్సో బ్రదర్స్ నిర్మిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..