Samantha: యశోద కోసం సమంత అంత రిస్క్ చేసిందా ?.. నెట్టింట వైరలవుతున్న క్రేజీ న్యూస్..

యశోద సినిమా కోసం సమంత హాలీవుడ్ స్టంట్ మ్యాన్ యాన్నిక్ బెన్ వద్ద యాక్షన్ సీన్స్ కోసం శిక్షణ తీసుకుందట. ప్రస్తుతం ఈ వార్త ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.

Samantha: యశోద కోసం సమంత అంత రిస్క్ చేసిందా ?.. నెట్టింట వైరలవుతున్న క్రేజీ న్యూస్..
Samantha

Updated on: Oct 21, 2022 | 6:27 PM

ప్రస్తుతం టాలీవుడ్ ముద్దుగుమ్మ సమంత.. ఖుషి సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమె నటించిన రెండు చిత్రాలు యశోద, శాకుంతలం షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన టీజర్‏తో యశోద మూవీపై ఆసక్తిని నెలకొంది. ఇందులో సామ్ ప్రెగ్నెంట్ మహిళగా కనిపించడం.. గాయాలతో సస్పెన్స్ థ్రిల్లర్‏గా టీటర్ రిలీజ్ చేయడంతో మూవీపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలకపాత్రలలో నటిస్తుండగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను నవంబర్ 11న విడుదల చేయనున్నట్లు ఇటీవల చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే ఈ మూవీకి సంబంధించిన ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్నాయి. తాజాగా మరో విషయం నెట్టింట వైరల్ అవుతుంది.

యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా.. సామ్ కెరీర్‎లోనే అత్యంత సవాలుగా ఉన్న చిత్రాలలో ఒకటి. ఇందులోని పలు యాక్షన్ సన్నివేశాల కోసం సామ్ అసలు వెనకడుగు వేయలేదట. ఈ సన్నివేశాల కోసం హాలీవుడ్ స్టంట్‏మ్యాన్ యాన్నిక్ బెన్‏ వద్ద శిక్షణ తీసుకుందట. గతంలో ఆమె నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ కోసం బెన్ వద్ద యాక్షన్ సన్నివేశాల కోసం శిక్షణ తీసుకుందట. ఇక ఇప్పుడు యశోద సినిమా కోసం అత్యంత కఠినమైన ట్రైనింగ్ తీసుకుందని సమాచారం. ఈ చిత్రానికి హరి, హరీష్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ సినిమానే కాకుండా సమంత .. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సరసన నటిస్తోంది. రూసో బ్రదర్స్ దర్శకత్వం వహించి సిటాడెల్ రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. ఫుల్ యాక్షన్ ఫ్యాక్డ్స్ గా ఈ సిరీస్ రాబోతుంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.