Samantha Ruth Prabhu: అతనే నా రోల్ మోడల్.. కానీ ఇప్పుడు చాలా మారిపోయాడు.. సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

|

Mar 05, 2024 | 11:13 AM

సమంత టాలీవుడ్ లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. అక్కినేని యంగ్ హీరో నాగ చైత్యన సరసన హీరోయిన్ నటించి ఆతర్వాత అతనితో ప్రేమలో పడింది. ఈ జంట వివాహబంధంతో ఒక్కటయ్యారు. కానీ ఊహించని విధంగా ఈ జంట విడిపోయి అభిమానులకు షాక్ ఇచ్చారు.

Samantha Ruth Prabhu: అతనే నా రోల్ మోడల్.. కానీ ఇప్పుడు చాలా మారిపోయాడు.. సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Samantha
Follow us on

స్టార్ హీరోయిన్ సమంత త్వరలోనే సినిమాలతో బిజీగా మారనుంది. యాక్టింగ్ కు సామ్ ఓ ఏడాది బ్రేక్ తీసుకున్న విషయం తెలిసిందే. మాయోసైటిస్ వ్యాధిబారిన పడిన సామ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. సమంత టాలీవుడ్ లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. అక్కినేని యంగ్ హీరో నాగ చైత్యన సరసన హీరోయిన్ నటించి ఆతర్వాత అతనితో ప్రేమలో పడింది. ఈ జంట వివాహబంధంతో ఒక్కటయ్యారు. కానీ ఊహించని విధంగా ఈ జంట విడిపోయి అభిమానులకు షాక్ ఇచ్చారు. విడిపోయిన తర్వాత ఇద్దరు ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. విడాకుల తర్వాత సమంత మైమోసైటిస్ బారిన పడటం అభిమానులను మరింత ఆందోళన చెందారు.

సమంత చివరిగా ఖుషి సినిమాలో నటించింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఇక ఇప్పుడు తిరిగి సినిమాల్లో బిజీగా మారనుంది. సామ్ తెలుగుతో పాటు తమిళ్, హిందీ సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు దళపతి విజయ్ సినిమాలో సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తోంది. దళపతి విజయ్ అట్లీ దర్శకత్వంలో రానున్న సినిమాలో సమంత హీరోయిన్ అని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా సమంత చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా సమంత ఓ కాలేజ్ ఈవెంట్ కు హాజరయ్యింది. అక్కడ స్టూడెంట్స్ తో సందడి చేసింది. ఈ క్రమంలోనే తనకు సినిమాల్లో రోల్ మోడల్ అల్లు అర్జున్ అని తెలిపింది సామ్. ఈ అమ్మడు అల్లు అర్జున్ పేరు చెప్పగానే స్టూడెంట్ కేకలతో హోరెత్తించారు. అల్లు అర్జున్ తన సినీ కెరీర్ లో రోల్ మోడల్ అని తెలిపింది. తను ఇప్పుడు ఓ యాక్టింగ్ బీస్ట్ గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాడు అని చెప్పుకొచ్చింది. సమంత అల్లు అర్జున్ కలిసి సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా చేశారు. అలాగే పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించి మెప్పించింది సామ్.

సమంత ఇన్ స్ట గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

సమంత ఇన్ స్ట గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.