Samantha: అమ్మాయిలా పోరాడండి.. ఆసక్తి రేపుతోన్న సమంత లేటేస్ట్ పోస్ట్..

|

Dec 04, 2024 | 6:06 PM

టాలీవుడ్ హీరోయిన్ సమంత కొన్ని రోజులుగా తీవ్ర దుఃఖంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు కార్డియాక్ అరెస్టుతో కన్నుమూశారు. ఈ క్రమంలోనే తాజాగా సామ్ తన ఇన్ స్టా స్టోరీలో పెట్టిన పోస్టు నెట్టింట వైరలవుతుంది.

Samantha: అమ్మాయిలా పోరాడండి.. ఆసక్తి రేపుతోన్న సమంత లేటేస్ట్ పోస్ట్..
Samantha News
Follow us on

టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇటీవలే సిటాడెల్ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా మయోసైటిస్ సమస్యకు చికిత్స తీసుకుంటూ విశ్రాంతి తీసుకున్న సామ్.. ఇప్పుడు తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే హిందీ హీరో వరుణ్ ధావన్ సరసన రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కించిన సిటాడెల్ వెబ్ సిరీస్ లో అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకుంది. ఈ సిరీస్ విజయోత్సావాల్లో ఉండగానే సామ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కొద్ది రోజుల క్రితమే సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కార్డియాక్ అరెస్టుతో కన్నుమూశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘మళ్లీ మనం కలిసి వరకు నాన్నా’ అంటూ రాసుకొచ్చింది సామ్. తాజాగా సామ్ ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

ఆ పోస్టులో.. తనను అగౌరవపరిచి ఓడించేందుకు ప్రయత్నించిన ఓ కుర్రాడితో పోరాడి అతడిని చితక్కోట్టిన ఓ అమ్మాయి వీడియోను షేర్ చేసింది సామ్. అందులో ఇద్దరు అమ్మాయి, అబ్బాయి మధ్య కుస్తీ పోటీ నిర్వహించగా.. ముందుగా అబ్బాయి పైచేయి సాధిస్తూ అమ్మాయిని ఓడించాలని చూస్తాడు. కానీ చివరకు ఆ అమ్మాయి తెలివిగా అతడిని ఓడిస్తుంది. దీంతో అబ్బాయి ఏడుస్తూ పక్కకు వస్తాడు. ఈ వీడియోను షేర్ చేస్తూ “అమ్మాయిలా పోరాడండి” అంటూ రాసుకొచ్చింది సామ్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరలవుతుండగా.. నెటిజన్స్ విభిన్నంగా స్పందిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. సామ్ మాజీ భర్త అక్కినేని నాగచైతన్య మరికొన్ని గంటల్లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. ఈరోజు రాత్రి 8 గంటలకు హీరోయిన్ శోభితా ధూళిపాళ్లను చైతూ వివాహం చేసుకోనున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో వీరిద్దరి పెళ్లి వేడుక జరగనుండగా.. ఇరు కుటుంబసభ్యులు, బంధవులు, సన్నిహితులు హాజరుకానున్నారు. చిరంజీవి, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్స్ సందడి చేయనున్నట్లు సమాచారం. 2021లో సమంత, చైతన్య విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

Samantha

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.