Samantha: మీరు బాధపడతారు.. మీరు ఆ నొప్పి అనుభూతి చెందుతారు.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు.
అక్కినేని నాగ చైతన్య- సమంత.. ఈ జంట గురించి మొన్నటివరకు అంతా అన్యున్యగా ఉంటారంటూ మాట్లాడుకున్నారు.
Samantha: అక్కినేని నాగ చైతన్య- సమంత.. ఈ జంట గురించి మొన్నటివరకు అంతా అన్యున్యగా ఉంటారంటూ మాట్లాడుకున్నారు. అంతే కాదు టాలీవుడ్‌లో మోస్ట్ లవ్లీ కపుల్‌గా ఈ ఇద్దరినీ చాలా మంది పొగడ్తలతో ముంచెత్తారు కూడా.. కానీ ఉన్నట్టుండి.. విడిపోతున్నాం అంటూ ప్రకటించి అందరిని షాక్‌కు గురిచేశారు చైతు- సామ్. నిజానికి ఈ ఇద్దరు విడిపోవడానికి సిద్ధంగా ఉన్నారంటూ కొంతకాలంగా మీడియాలో వార్తలు వస్తున్నటికి.. అవి ఎప్పటికైనా రూమర్స్‌గానే మిగిలిపోతాయని అనుకున్నారు అభిమానులు. కానీ ఊహించని విధంగా చైతన్య -సమంత ఇద్దరు తమ వివాహ బంధం ముగిసిందని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇక సమంత -చైతన్య విడిపోవడాన్ని ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మళ్లీ ఇద్దరు కలిస్తే బాగుండు అంటూ కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం నాగచైతన్య తన సినిమాలతో బిజీ అయిపోయారు. ఇప్పటికే లవ్ స్టోరీ సినిమాతో హిట్ అందుకున్న చైతన్య.. ఇప్పుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు థాంక్యూ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఏ ఈసినిమాలో చైతన్య హాకీ ప్లేయర్ గా కనిపించనున్నాడని తెలుస్తుంది. అలాగే నాగార్జున నటిస్తున్న బంగార్రాజు సినిమాలో నటిస్తున్నాడు చైతూ.. ఇలా తన సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.
ఇక సమంత విషయానికొస్తే సామ్ విడాకుల తర్వాత సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్‌లు పెడుతుంది. కొన్ని భావోద్వేగ కొటేషన్స్‌ను షేర్ చేస్తుంది సామ్. ఈ క్రమంలో తన పెట్స్‌తో- ఫ్రెండ్స్‌తో కలిసి సమయాన్ని గడుపుతూ బిజీగా ఉంటుంది ఈ భామ. ఇక ఈ అమ్మడు ఎక్కువ సమయం జిమ్‌లోనే గడిపేస్తుదేనని లేటెస్ట్ పోస్ట్‌లు చూస్తే తెలుస్తుంది. ఫిట్‌నెస్ పైన దృష్టిపెట్టిన సమంత.. జిమ్‌లో కష్టపడుతుంది. తాజాగా తన స్నేహితులతో కలిసి జిమ్‌లో ఇలా ఆటలాడుతూ గడుపుతుంది సమంత. ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతలో షేర్ చేసింది సామ్.
View this post on Instagram
మరిన్ని ఇక్కడ చదవండి :
Megastar Chiranjeevi : కళలను మరిచిపోతోన్న ఈ తరంలో ఇలాంటి సినిమా రావడం సంతోషంగా ఉంది: మెగాస్టార్
Suriya’s Jai Bheem : సూర్య ‘జై భీమ్’ నుంచి ‘పవర్’ సాంగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాట..
Akkineni: అక్కినేని అభిమానుల సంబరాలు.. సూపర్ హిట్స్ అందుకున్న అఖిల్- నాగచైతన్య..