Samantha: ఇట్స్ అఫీషియల్.! హాలీవుడ్‌‌లోకి అడుగుపెట్టనున్న సమంత.. డైరెక్టర్ ఎవరంటే.?

| Edited By: Anil kumar poka

Nov 27, 2021 | 12:19 PM

అక్కినేని నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత మళ్లీ సినిమాల వేగాన్ని పెంచింది. ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో...

Samantha: ఇట్స్ అఫీషియల్.! హాలీవుడ్‌‌లోకి అడుగుపెట్టనున్న సమంత.. డైరెక్టర్ ఎవరంటే.?
Samantha
Follow us on

నాగచైతన్యతో విడాకుల అనంతరం కెరీర్‌లో వేగాన్ని పెంచింది హీరోయిన్ సమంత. వరుసపెట్టి ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సామ్.. తాజాగా ఓ హాలీవుడ్ సినిమాకు పచ్చజెండా ఊపింది. గత కొద్దిరోజులుగా సమంత ఓ హాలీవుడ్ చిత్రంలో నటించబోతోందని సోషల్ మీడియా వేదికగా పలు వార్తలు షికారు చేశాయి. ఇక వాటిని నిజం చేస్తూ ఇవాళ సామ్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ వేదికగా ఆ వివరాలను తెలియజేసింది.

‘ఓ బేబీ’ చిత్రాన్ని నిర్మించిన సునీత తాటి నిర్మాతగా, ఫిలిప్ జాన్ దర్శకత్వం వహించనున్న ‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ అనే హాలీవుడ్‌ చిత్రంలో సమంత నటించనుంది. ‘Arrangements Of Love’ అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో 27 ఏళ్ల బైసెక్సువల్ తమిళ అమ్మాయి‌గా సామ్ కనిపించనుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలపై త్వరలోనే క్లారిటీ రానుంది.

ఇదిలా ఉంటే.. సామ్ తన మొదటి గ్లోబల్ సినిమా గురించి చెబుతూ.. ”సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నా.. నేను చివరిగా 2009లో ‘ఏ మాయ చేశావే’ సినిమా కోసం ఆడిషన్ చేశాను. 12 సంవత్సరాల తర్వాత, మళ్లీ ఆడిషన్‌కి వెళ్లినప్పుడు, నేను అదే భయాన్ని ఫీల్ అయ్యాను. నన్ను ఎంపిక చేసినందుకు థాంక్యూ సర్” అని ఇన్‌స్టాలో పేర్కొంది.

కాగా, సమంత తెలుగులో డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత శాకుంతలం సినిమాలో నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే తమిళంలో కాతువాకుల రెండు కాదల్ సినిమా చేస్తుంది. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయన్ లీడ్ రోల్ పోషిస్తుంది. అలాగే ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్‌తో సమంత ఓ ఐటెం సాంగ్‌లో మెరవనుంది.

Read Also: బిందె పట్టుకుని ఫోటోకి పోజిస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల మతులు పోగొడుతోంది.. ఎవరో కనిపెట్టండి!

కొండచిలువతో క్రేజీ ఆటలు.. గుడ్లను పట్టుకోబోయిన వ్యక్తిని ఏం చేసిందో చూస్తే షాకవుతారు!

ఈ 6 రాశులవారికి వచ్చే సంవత్సరం అదృష్టం వరిస్తుందట.. ఏయే రాశులంటే!

ఏడుగురు బ్యాట్స్‌మెన్లు డకౌట్.. 21 బంతుల్లోనే మ్యాచ్ ఖతం.. అసలు స్కోర్ ఎంతంటే?