Samantha: సిటాడెల్ షూటింగ్‏లో సమంతకు అస్వస్థత.. ఏడాదిన్నరగా పోరాడుతున్న సామ్..

మై జర్నీ విత్ ఆటో ఇమ్యూనిటీ పేరుతో ఈ విషయాలను యూట్యూబ్ లో రివీల్ చేస్తుంది. అందులో ప్రముఖ న్యూట్రీషనిస్ట్ అల్కేశ్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇందులో భాగంగా.. మయోసైటిస్ సమస్యతో పోరాడుతూనే సిటాడెల్ సిరీస్ కంప్లీట్ చేశానని.. యాక్షన్ సీన్స్ చేస్తున్న సమయంలో తాను అస్వస్థతకు గురయ్యాయని.. తల కుదుపుకు గురవ్వడంతో స్పృహా తప్పి పడిపోయాయని.. ఆ సమంయలో సెట్ మొత్తం అప్సేట్ అయ్యిందని చెప్పుకొచ్చింది.

Samantha: సిటాడెల్ షూటింగ్‏లో సమంతకు అస్వస్థత.. ఏడాదిన్నరగా పోరాడుతున్న సామ్..
Samantha

Updated on: Mar 22, 2024 | 7:00 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఖుషి సినిమా తర్వాత మయోసైటిస్ కారణంగా ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారు. కొన్నాళ్ల క్రితం ఇమ్యూనిటీ బూస్టింగ్ ట్రీట్మెంట్ తీసుకున్న సామ్.. ఇప్పుడిప్పుడే తిరిగి తన వర్క్ స్టార్ట్ చేసింది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం TAKE20 పేరుతో తన ఆరోగ్య పరిస్థితులను.. అందుకు సంబంధించి తాను తీసుకున్న జాగ్రత్తలను హెల్త్ పాడ్ కాస్ట్ సిరీస్ ద్వారా అభిమానులచో పంచుకుంటుంది. మై జర్నీ విత్ ఆటో ఇమ్యూనిటీ పేరుతో ఈ విషయాలను యూట్యూబ్ లో రివీల్ చేస్తుంది. అందులో ప్రముఖ న్యూట్రీషనిస్ట్ అల్కేశ్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇందులో భాగంగా.. మయోసైటిస్ సమస్యతో పోరాడుతూనే సిటాడెల్ సిరీస్ కంప్లీట్ చేశానని.. యాక్షన్ సీన్స్ చేస్తున్న సమయంలో తాను అస్వస్థతకు గురయ్యాయని.. తల కుదుపుకు గురవ్వడంతో స్పృహా తప్పి పడిపోయాయని.. ఆ సమంయలో సెట్ మొత్తం అప్సేట్ అయ్యిందని చెప్పుకొచ్చింది.

మయోసైటిస్ సమస్య వారం వారం తగ్గుతుందని అనుకున్నాను.. నాకే ఎందుకు వచ్చిందని బాధపడ్డానని.. చాలా గిల్టీగా ఫీలయ్యానని తెలిపింది. ఏడాదిన్నరగా దీనితో పోరాడుతున్నానంటే నమ్మలేకపోతున్నానని.. మానసికంగా దృఢంగా ఉంటే దేనినైనా జయించవచ్చని అర్థం చేసుకున్నాని తెలిపింది. ప్రతి ఒక్కరి జీవితంలో చీకటి రోజులు ఉంటాయని.. ఓర్పుతో ముందుకు వెళ్తే జీవితం అందంగా ఉంటుందని తెలిపింది. అలాగే ఈ సమస్య నుంచి కోలుకోవడానికి ఏ చేయాలి అనే విషయాలను తెలుసుకుని వాటిని పాటిస్తున్నట్లు తెలిపింది.

ఖుషి సినిమా తర్వాత వెంటనే సిటాడెల్ సిరీస్ చేయడానికి ఒప్పుకున్నానని.. ఈ సిరీస్ షూటింగ్ సమయంలో తాను ఎన్నో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నానని తెలిపింది. శారీరకంగా కష్టంగా ఉన్నా.. ఇందులో చాలా యాక్షన్ సీన్స్ ఉంటాయని.. ఎంతో శ్రమతో కూడుకున్నదని తెలిసినా ఈ సిరీస్ చేసేందుకు ఒప్పుకున్నానని తెలిపింది. ఇందులో కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నప్పుడు నొప్పులు, తిమ్మిరి కారణంగా ఉండడంతో షూట్ మధ్యలోనే న్యూట్రీషనిస్ట్ అల్కేశ్ కు తన టీమ్ కాల్ చేసిందని చెప్పుకొచ్చింది. సిటాడెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ జరుగుతున్నప్పుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాయని.. దీంతో సెట్ మొత్తం అప్సేట్ అయ్యిందని తెలిపింది. ఇప్పుడు సిటాడెల్ సిరీస్ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది.

మనోజ్ బాజ్ పేయి నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో సమంతకు నార్త్ ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ వచ్చింది. దీంతో ఆమెకు మరోసారి రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వర్క్ చేసే ఛాన్స్ వచ్చింది. వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటించిన సిటాడెల్.. హనీ ,, బన్నీ సిరీస్ లో సామ్ లీడ్ రోల్ పోషించింది. రిచర్డ్ మాడెన్, ప్రియాంక చోప్రా జోనాస్ ప్రధాన పాత్రల్లో నటించిన సిటాడెల్ సిరీస్ కు ఇండియన్ వెర్షన్ ఇది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.