
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆమె చివరిసారిగా డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించిన ఖుషి చిత్రంలో నటించింది. ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటించారు. ఈ మూవీ తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు సామ్. మయోసైటిస్ సమస్యతో కొన్నాళ్లుగా బాధపడుతున్న ఆమె.. ఈ వ్యాధికి చికిత్స కోసం అమెరికా వెళ్లింది. అక్కడే కొన్ని నెలలు ట్రీట్మెంట్ తీసుకున్న సమంత.. ఆ తర్వాత భూటాన్‌లో ఇమ్యూనిటీ కోసం చికిత్స తీసుకుంది. ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చింది సామ్. ప్రస్తుతం ఆమె విశ్రాంతి తీసుకుంటుంది. ఇటు సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ నిత్యం లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. అలాగే తాజాగా హనుమాన్ సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ మూవీ టీంపై ప్రశంసలు కురిపించింది సామ్. ఈ క్రమంలోనే తాజాగా ఆమెకు సంబంధించిన ఓత్రోబ్యాక్ వీడియో నెట్టింట వైరలవుతుంది.
న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి టాలెంట్‌కు సమంత ఫిదా అయ్యింది. ఆమె ఎనర్జీ.. డాన్స్ పెర్ఫామెన్స్ చూస ఆశ్చర్యపోయింది. మాటలు రావడం లేదని.. సాయి పల్లవి డాన్స్ చూస్తూ ఉండిపోయానంటూ చెప్పుకొచ్చింది. కానీ ఈ మాటలు ఇప్పుడు చెప్పలేదు. కొన్ని సంవత్సరాల క్రితం సాయి పల్లవి పై ఈ కామెంట్స్ చేసింది సామ్. ఇంతకీ ఎప్పుడు ?.. ఎక్కడా ?.. అని అనుకుంటున్నారా ?. కథానాయికగా కెరీర్ సినీ ప్రయాణం మొదలుపెట్టిన సమయంలో సామ్.. ప్రముఖ డాన్స్ షో డీకి అతిథిగా హజరయ్యారు. అందులో అప్పుడు సాయి పల్లవి కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసింది. ఈ షాలో సాయి పల్లవి డాన్స్ చూసి ముగ్దురాలయ్యింది సామ్. మీరు డాన్స్ చేస్తున్నప్పుడు నా చూపు తిప్పుకోలేకపోయాను. అద్భుతంగా డాన్స్ చేశారు అంటూ చెప్పుకొచ్చింది సామ్. ఇక ఆమె మాటలకు థాంక్స్ అంటూ బదులిచ్చింది సాయి పల్లవి . ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. అయితే ఆ వీడియోలో సామ్, సాయి పల్లవిని గుర్తుపట్టడం మాత్రం కష్టమే.
Samantha garu had bee a long term fan of Sai Pallavi ! Doubly love her for that. 🧡🧡🧡 pic.twitter.com/M8jP6cGx5J
— 𝔖𝔥𝔞𝔩𝔩𝔞𝔫 (@Shallan72) April 7, 2019
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సాయి పల్లవి తండేల్ చిత్రంలో నటిస్తుంది. డైరెక్టర్ చందూ మోండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్నారు. మత్స్యకారుల జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ గ్లింప్స్ ఆకట్టుకుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.