Samantha Akkineni: అక్కినేని కోడలు పిల్ల సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాతోనే మాయ చేసిన ఈ చిన్నది.. ఆతర్వాత కుర్రాళ్ల కలల రాకుమారిలా మారిపోయింది. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది ఈ క్యూటీ. ఇటీవలే ఓ వెబ్ సిరీస్‌తో బాలీవుడ్‌లోకి కూడా అడుగు పెట్టింది సమంత. అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడిన సామ్. ఆ తర్వాత సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తుంది. ఆచి తూచి కథలను ఎంచుకుంటూ మంచి విజయాలను సాధిస్తోంది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించిన సమంత.. లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌తో కూడా ఆకట్టుకుంటుంది. నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఓ బేబీ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది సామ్. ప్రస్తుతం తెలుగులో గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే సినిమాలో నటిస్తుంది.
ఇదిలా ఉంటే సమంతా సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన సినిమా అప్డేట్స్ తోపాటు, రకరకాల ఫోటో షూట్స్‌తో ఆకట్టుకుంటుంది. అలాగే వర్కౌట్స్‌కు సంబంధించిన వీడియోలతో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది సామ్. తాజాగా సమంత పోస్ట్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ఫోటోకి క్షణాల్లో లక్షల లైకులు వచ్చి పడ్డాయి. కేవలం ఈ ఫోటో పోస్ట్ చేసిన 3 గంటలలోనే 10 లక్షలకు పైగా లైక్లు వచ్చాయి. ఇంతకు అంతలా ఆ ఫొటోలో ఏముంది అనుకుంటున్నారా అయితే ఆ ఫోటోను మీరే చూడండి.
మరిన్ని ఇక్కడ చదవండి : Meera Mitun: నన్ను అరెస్ట్ చేయడం కలలోనే జరుగుతుంది.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్..
Pushpa: ‘పుష్ప’ సాంగ్ వచ్చేసింది.. ఊర మాస్ లుక్‌లో అదరగొట్టిన బన్నీ.. ఫ్యాన్స్‌కు ఇక పూనకాలే..
చాణక్య నీతి: ఈ మూడు అలవాట్లు ఉంటే.. యువత జీవితం నాశనం అయినట్లే.. అవేంటంటే.!