Samantha Ruth Prabhu : గేమ్ షోకు గెస్ట్‌గా సమంత.. విడాకుల తర్వాత మొదటిసారి..!!

|

Oct 07, 2021 | 4:56 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగానే కాకుండా హోస్ట్‌గానూ రాణిస్తున్న విషయం తెలిసిందే..తనదైన మాటలతో బుల్లితెర పై కూడా సందడి చేస్తున్నారు తారక్.

Samantha Ruth Prabhu : గేమ్ షోకు గెస్ట్‌గా సమంత.. విడాకుల తర్వాత మొదటిసారి..!!
Samantha
Follow us on

Samantha: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగానే కాకుండా హోస్ట్‌గానూ రాణిస్తున్న విషయం తెలిసిందే..తనదైన మాటలతో బుల్లితెర పై కూడా సందడి చేస్తున్నారు తారక్. యంగ్ టైగర్ హోస్ట్ చేస్తున్న ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు గేమ్ షో  టాప్ టీఆర్ఫీతో దూసుకుపోతుంది. ఈ గేమ్ షో మొదటి ఎపిసోడ్‌‌‌లో గెస్ట్‌గా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత టాప్ డైరెక్టర్స్ కొరటాల శివ, దర్శక ధీరుడు రాజమౌళి హాజరయ్యారు. ఈ మధ్య సూపర్ స్టార్ మహేష్ బాబు ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు గేమ్ షోకు రానున్నారని వార్తలు వినిపించాయి. ఈ మేరకు ఓ ఫోటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇక ఇప్పుడు ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు కు ఓ స్టార్ హీరోయిన్ రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఎవరంటే

టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా కంటిన్యూ అవుతున్న సమంత త్వరలో తారక్ హోస్ట్‌గా చేస్తున్న ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు ప్రోగ్రామ్‌కు రానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ ప్ర‌త్యేక‌మైన ఎపిసోడ్ షూటింగ్‌లో పాల్గొంటుంద‌ట‌. ఇక ఈ స్పెష‌ల్ ఎపిసోడ్ ఈ నెల చివ‌ర‌లో కానీ.. వ‌చ్చే నెల ప్రారంభంలో కాని టెలికాస్ట్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే సమంత తన వివాహబంధానికి ముగింపు పలికిన విషయం తెలిసిందే. ఈ సమయంలో సమంత తారక్ ప్రోగ్రామ్‌కు వస్తుందా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Varun Tej’s Ghani: మొదటి పంచ్ విసిరిన మెగా హీరో.. వరుణ్ తేజ్ ‘గ‌ని’ ఫస్ట్ గ్లింప్స్ ..

Manchu Vishnu on MAA Elections 2021: మేనిఫెస్టో తో మీడియా ముందుకు మంచు విష్ణు.. ఆ బాధ్యత నాదే అంటూ కీలక నిర్ణయం..(లైవ్ వీడియో)

Rukshar Dhillon:క్యూట్ క్యూట్ అందాలతో అలరిస్తోన్న రుక్సార్ ధిల్లాన్ లేటెస్ట్ పిక్స్