‘బిగ్‌బాస్’ షో ఎంత ప్రాచుర్యం చెందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా హిందీ వెర్షన్ భారీ వ్యూయర్షిప్ సంపాదించుకుని 13 సీజన్లు కంప్లీటు చేసుకుంది. దీంతో ‘బిగ్‌బాస్ 14’ కోసం టెలివిజన్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. దీంతో వారికోసం త్వరలోనే ప్రోమో రిలీజ్ చేసేందుకు యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. అందుకు హోస్ట్ సల్మాన్ ఖాన్ కూడా రెడీ అయినట్లు సమాచారం. దీనిపై అఫిషియల్ అనౌన్సిమెంట్ రానప్పటికి..నిర్మాతలు సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
సల్మాన్ ఫామ్‌హౌస్‌లో త్వరలోనే ప్రోమోను షూట్ చేయబోతున్నారనట. కోవిడ్-19 కారణంగా భౌతిక దూరం పాటిస్తున్నందున ప్రోమో థీమ్ కూడా ఈ నేపథ్యంలోనే ఉండనున్నట్లు సమాచారం. కొత్త సీజన్ అక్టోబరులో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే సీజన్లో ఎవరెవరు పాల్గొంటారన్నది ఇంకా స్పష్టత లేదు. షగున్ పాండే, శుభంగి అట్రేలను ఈ షో కోసం అప్రోచ్ అవ్వగా.. వారు అంగీకరించినట్లు టాక్. చాపత్ ఖన్నా కూడా ఈ రియాల్టీ షోలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.